అబుదాబి వేదికగా ఐఫా వేడుకల్లో నటి రేఖ ప్రత్యేక నృత్యప్రద్శన

Actress Rekha's special dance performance at IIFA celebrations in Abu Dhabi
Spread the love

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 27 నుంచి 29 వరకు జరగనుంది. ఈ సినీ పండగ ఐఫా 2024 కోసం ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సీనియర్‌ నటి రేఖ నృత్య ప్రదర్శన ప్రత్యేకం కానుంది. ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే రేఖ ఈ ఏడాది కూడా ప్రత్యేకత చాటుకోనున్నారు. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై డ్యాన్స్‌ చేయనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఐఫాకు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది. అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతను చాటడం నాకు లభించిన ఓ అవకాశం. ఇంత గొప్ప ఫెస్టివల్‌లో మరోసారి భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఐఫా 24వ ఎడిషన్‌లో విూ అందరితో కలిసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఎదురుచూస్తున్నాను. ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనిది’ అని చెప్పారు. ఈ ప్రదర్శనకు ఆమె మనీష్‌ మల్హోత్ర ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన క్యాస్టూమ్‌ను ధరించనున్నారు.ఈ ఏడాది జరగనున్న ఐఫా వేడుకలకు బాలీవుడ్‌ స్టార్స్‌ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహర్‌, విక్కీ కౌశల్‌ ఈ ఈవెంట్‌లో యాంకర్లుగా సందడి చేయనున్నారు. షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌లతో పాటు మరికొందరు అగ్ర తారలు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

Related posts

Leave a Comment