నటుడు విజయ రంగరాజు కన్నుమూత

Actor Vijay Rangaraju passes away
Spread the love

>సినీ నటుడు విజయ రంగరాజు గుండెపోటుకు గురై చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) ఉదయం కనుమూశారు. భైరవ ద్వీపం సినిమాలో విలన్ గా సినీ రంగ ప్రవేశం చేసి వందలాది చిత్రాల్లో నటించారు. యజ్ఞం సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పూనె కు చెందిన విజయ రంగరాజు సినిమా అవకాశాల కోసం వచ్చి చెన్నై లో స్థిరపడ్డారు. పెద్దగా సంపాదించింది లేదు. అందుకే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఎస్వి రంగారావు లా పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశ్యం తో బాపు గారు అతని పేరును విజయ రంగరాజుగా మార్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కుల తీవ్రత పెరిగిందని బాహాటంగా విమర్శించి పలు బ్యానర్స్ కు దూరమై ఆర్ధిక ఇబ్బందులు పడిన మనసున్న నటుడు. కొంతకాలం లండన్ వెళ్లి అక్కడ రెస్టారెంట్ లో కూడా పని చేసినట్లు సమాచారం. చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించిన విజయ రంగ రాజు.. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లి ప్రాణాలు కోల్పయిన విజయ రంగ రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు. 1994 లో వచ్చిన ఆయన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. యజ్ఞం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు.
వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది. ఆయన ‘భైరవ ద్వీపం’ కంటే చాలా ముందే అశోక చక్రవర్తి, స్టేట్ రౌడీ, విజయ్ లాంటి సినిమాల్లో నటించారు.

Related posts

Leave a Comment