మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని ప్రాంతాలలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. 6వ రోజు ముగిసే నాటికి, ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇప్పుడు రూ. 300 కోట్ల మార్కు చేరువలో ఉంది. ముఖ్యంగా “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం యూఎస్ఏ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. గతంలో చిరంజీవి అత్యుత్తమ ఓవర్సీస్ చిత్రంగా నిలిచిన ‘సైరా నరసింహారెడ్డి’ (2.7 మిలియన్లు) రికార్డ్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అధిగమించింది. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
మెగాస్టార్ కెరీర్ లోనే సరికొత్త రికార్డ్!
