చిత్రం: కోతలరాయుడు
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ :4/5
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్
నటీనటులు:
శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి,
పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ,
బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,
సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్,
]సుధ, హేమ, శ్రీ లక్ష్మీ,
జయవాణి, తాగుబోతు రమేష్
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: బుజ్జి
ఎడిటర్: ఉద్ధవ్
మాటలు: విక్రమ్ రాజ్, స్వామి మండేలా
ఆర్ట్ డైరెక్టర్: ఠాగూర్
పాటలు: కంది కొండ
ఫైట్స్: రియల్ సతీష్
పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మ
కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి
ఒక సినిమా బాగుండాలంటే ఆ సినిమాలో ఏం ఉండాలి? అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అది నిజమే! అయితే.. ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్న మాట వాస్తవమే. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ `కోతల రాయుడు`గా ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా ఆయన చేసిన ధైర్యమే! ఎంతో ఆశతో హీరో శ్రీకాంత్ చిత్రాల్ని ఎంపిక చేసుకుంటాడు. ఎందుకంటే .. ఆయన వేసిన ప్రతి అడుగు అది హీరోగానా.. విలన్ గానా ఏదైనాకానీ .. సినిమా బాగు కోసమే ఉంటుంది. తన కోసం తను ఎప్పుడూ ఆలోచించడు. నిర్మాత బాగుండాలి.. దర్శకుడు బాగుండాలి.. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుండాలి.. అదే ఆయన తపన. ఇలాంటి సమయంలో విడుదలైన చిత్రం `కోతలరాయుడు`. 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి యువ దర్శకుడు సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. సుధీర్ రాజుకు సినిమా ఓ ఫ్యాషన్. ఓ జీవితం కూడా సినిమానే!! అలాంటి దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న ఈ `కోతల రాయుడు` ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథ: అప్పులు చేసుకొని తిప్పలు పడే ఓ గొప్ప మనీ మైండెడ్ అజయ్ (శ్రీకాంత్) జల్సా రాయుడు. ఇందుకోసం తన మిత్రులను కూడా తన లగ్జరీలకు వాడుకుంటాడు. అలవాటు పడి డబ్బును బాగా దుబారా చేస్తుంటాడు. ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా ఉన్న అజయ్ డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) పై మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏకంగా నిశ్చితార్ధం కూడా చేసుకుంటాడు. కానీ అనుకోకుండా ధనలక్షి కుటుంబానికి అజయ్ తో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ తరువాత సంధ్య (డింపుల్ చోపాడియా) ని ప్రేమిస్తాడు. మరి అజయ్ , ధనలక్ష్మి నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ? సంధ్యని పెళ్లి చేసుకున్నాడా? అజయ్ జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? అన్నదే అసలు కథ.
విశ్లేషణ: ముందుగా యువ దర్శకుడు సుధీర్ రాజుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఓ ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ ని బాలయ్య చిత్రం ‘అఖండ’లో ఓ విలన్ గా చూసిన జనాలకు మళ్లీ ఓ ‘పెళ్లిసందడి’ గుర్తు చేశారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా శ్రీకాంత్‌కి గొప్ప పేరుంది. ఆయనకు ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘అఖండ’లో ఓ విలన్ గా శ్రీకాంత్ ని చూడడానికి ఎప్పుడూ .. ఎవ్వరూ ఇష్టపడరు. చాలా రోజుల తర్వాత హీరో శ్రీకాంత్ మరోసారి తన మార్క్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా `కోతల రాయుడు` సినిమాను కుటుంబం అంతా కలిసి చూడవచ్చు. హీరోగా శ్రీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తనదైన శైలిలో మెప్పించారు. కాకపోతే కథ, కథనాలు కాస్త రొటీన్‌గా అనిపిస్తుంటాయి. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ నటశా, డింపుల్ సూపర్ గా మార్కులు కొట్టేశారు. కెమెరామెన్ బుజ్జి వర్క్ బాగుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పోసాని, మురళి శర్మ పాత్రలు సినిమాకు సహకరించాయి. పాటలు సూపర్. అందమైన లొకేషన్లో అద్భుతంగా చిత్రీకరించారు. సునీల్ కశ్యప్ సంగీతం వండర్ ఫుల్.
దర్శకుడు సుధీర్ రాజు ఎంచుకున్న కథ కథనాలు ఎంతో బాగున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను ప్రేక్షకుల దగ్గరికి చేరువ చేశాడు. శ్రీకాంత్ ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సుధీర్ రాజు వంద శాతం సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ ఈ మధ్య నటించిన కొన్ని చిత్రాలతో పోలిస్తే `కోతల రాయుడు` వండర్ గా ఉంది. కథ, స్క్రీన్ ప్లై , డైరెక్షన్ అన్ని ఈ సినిమాకు బాగా కుదిరాయి. సరదాగా సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ది గ్రేట్ ఇ.వి.వి సత్యనారాయణ మళ్లీ ఈ సినిమా ద్వారా గుర్తుకు వచ్చేలా చేశాడు దర్శకుడు సుధీర్ రాజు. ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్. అలాగే ఈ శ్రీకాంత్ `కోతల రాయుడు`కు కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు సుధీర్ రాజే!! ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్!! చూసే ప్రేక్షకుడికి వినోదాల విందు!! దర్శకుడు సుధీర్ రాజుకు ఈ సినిమా ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని సినిమా చుసిన ప్రేక్షకులు దీవించడం కొసమెరుపు!!