బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు చిరు ఎందుకు రాలేదు?

balakrishna-unstoppable-show-writer-bvs-ravi-about-chiranjeevi
Spread the love

ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ తో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోతో బాలయ్య యావత్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోకి చాలా మంది సేలబ్రిటీలు వచ్చారు. వారితో సరదాగా మాట్లాడుతూనే ప్రేక్షకులకు కావల్సిన కాంట్రవర్సీస్ మొదలకొని ఎమోషన్స్ వరకు అన్ని కోణాల్లో ప్రశ్నలు గుప్పిస్తూ అలరిస్తారు బాలయ్య. అయితే తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఇంత మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ షోకి టాలీవుడ్ మెగా బాస్ చిరంజీవి రాకపోవడం వెనక ఏంటి మతలబు అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ షోకు చిరంజీవి వస్తారా.. రారా? అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1 పూర్తయింది. చిరంజీవి లేకుండానే ఓ సీజన్ ముగిసింది. ఇంతకీ బాలయ్య టాక్ షోకు చిరు ఎందుకు రాలేదు? ఆహా టీమ్ చిరంజీవి కోసం ప్రయత్నం చేయలేదా? అల్లు అరవింద్ లైట్ తీసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అన్ స్టాపపబుల్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి సమాధానం ఇచ్చారు. “బాలయ్య, చిరంజీవితో టాక్ షో అంటే దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. అదంతా మేం స్టార్ట్ చేశాం కూడా. చిరంజీవి గారి ఎంట్రీ కంటే ముందు నుంచే బాలయ్య ఉన్నారు. చిరంజీవితో పోలిస్తే వయసులో బాలయ్య చిన్నవాడు, కానీ సీనియారిటీలో పెద్దవాడు. ఈ మేజిక్ ను రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించి వర్క్ కూడా జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండో సీజన్ బాలయ్య-చిరంజీవి టాక్ షోతోనే ఓపెన్ అవ్వొచ్చు చిరంజీవి గారిని ఆల్రెడీ అడిగాం. ఈ సీజన్ కు కుదరలేదు. నెక్ట్స్ సీజన్ కు తప్పకుండా వస్తారు. ఆయన ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’, దర్శకుడు బాబి సినిమా, ‘ఆచార్య’ డబ్బింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా మరోవైపు ఏపీ థియేటర్ల విషయంలో రాజకీయ చదరంగం నడుస్తోంది. ఇంత బిజీగా ఉండడం వల్లనే ఆయన రాలేకపోయారు. ఈసారి తప్పకుండా వస్తారు” అంటూ.. ఇలా బాలయ్య-చిరంజీవి టాక్ షోపై స్పందించారు బీవీఎస్. కేవలం డేట్స్ సెట్ అవ్వక చిరంజీవి రాలేకపోయారని, అంతకుమించి రాజకీయ, సామాజిక కారణాలేం లేవని క్లారిటీ కూడా ఇచ్చారని చిరు అభిమానులకు చెప్పారు.

Related posts

Leave a Comment