చిత్రం: ‘శ్యామ్ సింగరాయ్’
విడుదల తేది: 24 డిసెంబర్ 2021
నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి,
మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్,
మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా,
లీలా సామ్సన్, మనీష్ వద్వా,
బరున్ చందా తదితరులు.
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
నిర్మాణం: నిహారిక ఎంటర్ టైన్ మెంట్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీతం: మిక్కీ జే మేయర్
కూర్పు: నవీన్ నూలి
కథ: సత్యదేవ
ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్
నాని హీరోగా నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (24 డిసెంబర్ 2021) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించాడు. మరి ఈ ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు.. గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్న నానికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది.. తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ: నేటితరం యువకుల్లాగే వాసు దేవ్(నాని)కు సినిమా అంటే పిచ్చి. దాంతో తను చేస్తున్న సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి…షార్ట్ ఫిల్మ్ చేసి సినిమా అవకాశలకోసం కోసం ప్రయత్నాలు సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతని షార్ట్ ఫిల్మ్ లో నటించిన కీర్తి (కీర్తి శెట్టి) తోనే ఓ ఫీచర్ ఫిల్మ్ చేస్తాడు. అది కూడా భారీ సక్సెస్ ని సాధిస్తుంది. ఆ చిత్రాన్ని బాలీవుడ్ లోనూ చేయడానికి హిందీ రీమేక్ ఆఫర్ వస్తుంది. ఈ సంతోషంలో ఉండగానే ఓ ఊహించని సమస్య అతడి మెడకు చుట్టుకుంటుంది. అతని కథ ఓ కాపీరైట్స్ సమస్యలో ఇరుక్కుంటుంది. వాసు చేసే కథలు యథాతతంగా 1970 లలో ‘శ్యామ్ సింగరాయ్’ రాసిన కథలను పొలిఉన్నాయని ఎస్.ఎస్.ఆర్ అనే ఓ పబ్లిషర్ కోర్టుకెళతాడు. తనది ఒరిజనల్ కథే అంటాడు వాసు. ఈ విషయంలో తనను ప్రూవ్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మరి వాసు అప్పుడేం చేశాడు? ఇంతకీ ఈ శ్యామ్ సింగరాయ్ ఎవరు? ఈ సినిమాలో దేవదాసిగా చేసిన సాయి పల్లవి పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ కథా రచయిత సత్యదేవ పేపర్ మీద అనుకున్న కథను, తెర మీదకి అంతకు మించి ట్రాన్స్ ఫార్ చేయడం నిజంగా సత్యదేవ్ అదృష్టం. తన మొదటి సినిమా A film by aravind అప్పుడు దర్శకుడు శేఖర్ సూరి ఆ మ్యాజిక్ చేసాడు …ఇప్పుడు డైరెక్టర్ రాహుల్ వెరీ ఇంట్రెస్టింగా తెరకెక్కించాడు. అది నిజంగా కథా రచయితగా సత్యదేవ అదృష్టమే!
దర్శకుడు రాహుల్ గురించి చెప్పాలంటే మొదటీ సినిమా END అని, రెండో సినిమా టాక్సీ వాలా (విజయ్ దేవరకొండ, హీరో) చాలా కన్విన్సింగ్గా తీసాడు + అవి అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి… ఇప్పుడు ఈ సినిమా అంతా బాగా వచ్చిందంటే అతనికే ఆ క్రెడిట్ అంతా దక్కుతుంది…..ఈ సినిమా రెండో భాగం కూడా వస్తే చూడొచ్చు అనేలా ఉంది..
ఇంకా సినిమా విషయానికి వస్తే ఈ మధ్య కాలం లో నేను నిద్ర పోకుండా మొత్తం చూసిన సినిమా ఇదే.( నిద్ర వచ్చేట్టు సినిమా తీస్తే తప్పు నాది కాదు)..అసలు నిద్రాదేవి పక్కకి కూడా రాలేదు…
రెండు పాత్రల్లో , ఒకటి 1960లో సింగరాయ్..ఇంకోటి 2021లో వాసుగా..బ్రహ్మాండంగా నటించాడు నాని. …….
దేవదాసిగా సాయి పల్లవి బాగా చేసి ఆ కాలం దేవదాసీలు పడే బాధలు/కష్టాలు బాగా చూపించారు..
ముఖ్యంగా సాయి పల్లవి గురించి చెప్పాలంటే తనకు ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే.. తను అంత పెద్ద అందగత్తే కాదు కానీ , మంచి ఫ్యామిలీ లుక్, నిండైన ఆడతనం సినిమాలో కాకుండా, బైట చాలా పొందికగా, చక్కటి మర్యాదగా మసులుకోవడం అవసరమైన సిగ్గు,. సిన్సియారిటీ తన ఆకర్షణలు. కొడుకులు ఉన్న తల్లి తండ్రులు కోడలిగా చేసుకోవాలని, కుర్రాళ్ళు ఏకంగా పెళ్లి చేసుకోవాలని అనుకునేంత ఇమేజ్ తెచ్చుకోవడం తన సొంతం….
మిగతా పాత్రల విషయానికి వస్తే కీర్తిశెట్టి ఓకే..అలాగే లాయర్ పాత్రలో కనిపించిన అమ్మాయి మంచినీళ్లు తగినంతగా సునాయాసంగా నటించేసింది . టిల్ నవ్ వి మిస్సెడ్ హర్…
పాటలు ఉన్నవి కొన్నే అయినా సందర్భోచితంగా బాగున్నాయి.. ..
గుడిలో పెద్ద పూజారి గా నటించిన నటుడు కూడా విలను గా బాగా నటించాడు..
ఓవరాల్ గా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూడొచ్చు.
-సరోజ