ఆర్ఆర్ఆర్- రాధేశ్యామ్ చిత్రాల విడుదలకు కరోనా ఎఫెక్ట్ కానుందా?

RRR MOVIE POSTER
Spread the love

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాజాగా అందరి దృష్టి న్యూఇయర్ తొలివారంలో రాబోయే ప్యాన్ ఇండియా సినిమాల మీదే ఉంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం) జనవరి 7న రానుండగా, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం ‘రాధేశ్యామ్’ 14న విడుదల కానున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విడుదలకు పకడ్భంది ఏర్పాట్లు చేసారు. అయితే.. అంతా ఒకే అనుకుంటున్న సమయంలోనే ఈ రెండు చిత్రాలకు కరోనా రూపంలో ఎక్కడో కొంత భయం పట్టిపీడిస్తోందిట. ఇప్పుడు కరోనా మూడో దశ ప్రారంభమయింది. మహరాష్ట్రలో అయితే.. కరోనా ఫలితంగా తొమ్మిది గంటలకే అన్నీ సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు కాబట్టి నైట్ షో లు రెండూ పూర్తిగా ఎఫెక్ట్ అవడం ఖాయం. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీ. గుజ‌రాత్, ఢిల్లీ ఇలా ఒక్కోక్క చోట ఒక్కో రకమైన నిబంధనలు అమలు చేయడం ప్రారంభమైంది. చెన్నయ్ లో కూడా త్వరలోనే కొత్త రూల్స్ రానున్నట్టు సంకేతాలు వచ్చాయి. అయితే.. మన తెలుగురాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ఇప్పటికైతే ఒకే. ఈ రెండు సినిమాల విడుదల సమయానికి రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఊహించలేక పోతున్నారు. అంతా సర్దుకుంది. పండుగ సినిమాల ప్లానింగ్ ఫిక్స్ అయింది అనుకంటే మళ్లీ వ్యవహారం ఇలా మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల డేట్ లు మారనున్నాయా? లేదా.., అలాగే వుంటాయా అన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడంలేదు!!

Related posts

Leave a Comment