ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి నిర్మాత నట్టికుమార్ లేఖ

nattikumar news
Spread the love

To
The Hounarable Chief Minister of Andhrapradesh,
Sri YS Jagan Mohanreddy garu,

Subject: సినీ పరిశ్రమ తరపున కొంతమంది మాత్రమే మిమ్ములను కలుస్తున్నందువల్ల నాతో పాటు పలువురం వాస్తవ పరిస్థితులను, మా అభిప్రాయాలను ఈ లెటర్ ద్వారా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం.
ప్రభుత్వమే థియేటర్స్ ఆన్ లైన్ టికెట్ విక్రయ విధానానికి పూనుకునేలా జీవో నెంబర్ 782ను జారీ చేయడం అభినందనీయం. దీనిని కొనసాగించాలని నాతో పాటు అధికశాతం మంది ఎగ్జ్ బిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కోరుకుంటున్నారు. FDC ద్వారా సినీ థియేటర్స్ కు బ్యాంకు వడ్డీకి రుణ సౌకర్యం కల్పించాలి. ఏపీలో షూటింగ్ చేసిన చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించాలని కోరుతున్నాం.

Respected Sir,

నేను నట్టికుమార్, సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా సినీ పరిశ్రమలో సుధీర్ఘకాలంగా ఉన్నాను. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ…సినీ థియేటర్స్ ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయ విధానాన్ని ప్రభుత్వమే చేపట్టేందుకు పూనుకోవడం హర్షనీయం. దీనివల్ల దళారీ వ్యవస్థ లాభపడకుండా ప్రభుత్వానికే మంచి ఆదాయం సమకూరుతుంది. బుక్ మై షో వంటి సంస్థలు కేవలం ఒక టికెట్ కు అదనంగా 27 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఆ ఆదాయం ప్రభుత్వానికే వస్తే…ఒక రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖజానాకు వస్తుంది. ఇక ఓ ముఖ్య విన్నపం ఏమిటంటే… ఆన్ లైన్ టికెట్స్ ద్వారా వచ్చిన డబ్బును ఏ రోజుకు ఆ రోజునే ఎగ్జ్ బిటర్ కు అందజేస్తే చాలా బావుంటుంది. ఎగ్జ్ బిటర్లు అంతా దీనినే కోరుకుంటున్నారు.
అలాగే 35 జీవోను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో షూటింగ్ చేసిన చిన్న చిత్రాలకు సబ్సిడీని అందించాలని కోరుతున్నాం. ఇంకో విన్నపాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఎ క్లాస్ సెంటర్స్ థియేటర్స్ కు కోటి రూపాయలు, బి క్లాస్ సెంటర్స్ థియేటర్స్ కు 50 లక్షలు, సీ క్లాస్ సెంటర్స్ కు 20లక్షల రూపాయలను FDC ద్వారా బ్యాంకు వడ్డీకి రుణాలను ఇప్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో థియేటర్స్ మైంటెనెన్స్ కు శానిటైజర్ తదితరాలకు ఒక ప్రేక్షకుడికి 11 రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం 3 రూపాయలే ఇస్తున్నారు. దానిని కనీసం 7 రూపాయలుగా చేయాలని తమరిని కోరుతున్నాం. పేదవాడి మేలు కోసం ఎన్నో పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మీరు సినీ పరిశ్రమ బాగు కోసం చేస్తున్న కృషి కూడా అత్యంత ప్రశంసనీయం. మా విన్నపాలను మన్నించి సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ…

ధన్యవాదములతో
నట్టికుమార్,
సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్

Related posts

Leave a Comment