వైభవంగా శృతిలయ ద్విదశాబ్ధి ఉత్సవాలు

sruthilaya dwidashabdhi utchavaalu
Spread the love

ఉర్రూతలూగించిన “ఝుమ్మంది నాదం”

నిస్వార్ధ సేవతో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఇన్నేళ్లు నాణ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ఇరవయ్యో వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయం అని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి శుభాకాంక్షలు తెలిపారు. మానవీయ పరిమళాలు వెదజల్లే గొప్ప మహోన్నత వ్యక్తులు సమాజం లో ఇంకా వున్నారని, గుడ్ల ధనలక్ష్మి సేవలు గొప్ప స్ఫూర్తి ఇస్తున్నాయని ప్రశంసించారు.
సీల్ వెల్ కార్పొరేషన్ సౌజన్యం తో రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను దివంగతులైన డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై.కె.నాగేశ్వరరావు, గాయకుడు బి.వెంకట్రావు లకు అంకితం చేశారు. శృతిలయ సంస్థ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన సమాజ సేవకురాలు శ్రీమతి జి.ధనలక్ష్మి గారితో శ్రీ ఎస్.మధుసూధనాచారి ప్రమాణ స్వీకారం చేయించారు. సేవా కార్యక్రమాలు చేసే మహానుభావులను సత్కరించుకోవడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ పూర్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు.
సభాధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ సమాజ సేవ లో అంకితమైన వారిని గుర్తించి సన్మానాలు చేస్తూ మరోవైపు సంగీత సేవ చేస్తూ అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆమని గారు గొప్ప కార్యదక్షురాలు గా గుర్తింపు పొందారని అభినందించారు.
ఈ వేడుకలో శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీమ్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొల్లేటి దామోదర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాట్య గురు శ్రీమతి నిర్మల ప్రభాకర్, యువకళావాహిని అధ్యక్షులు శ్రీ లంక లక్ష్మి నారాయణ, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, సంఖ్యా శాస్త్ర నిపుణులు శ్రీ దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. శృతిలయ 20వ వార్షిక కేక్ ను నూతన అధ్యక్షురాలు శ్రీమతి గుడ్ల ధనలక్ష్మి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ధనలక్ష్మి ట్రస్ట్ సభ్యులు పాట రూపం లో ఆమె ను అభినందించారు. గాయని ఆమని ఆధ్వర్యం లో పి.సుభాష్, బి.శ్రీనివాస్, విజయ, మానస, శ్రావణి తదితరులు ఝుమ్మంది నాదం శీర్షికతో సినీ సంగీత విభావరి నిర్వహించి ఉర్రూతలూగించారు. శ్రీ పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యానం చేయగా, శ్రీమతి ఆమని పర్యవేక్షించారు.

Related posts

Leave a Comment