తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తరపున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం : సంచాలకులు మామిడి హరికృష్ణ

telangana prabuthwa shakha sanchalakulu mamidi harikrishna
Spread the love

3 లేదా 4 షార్ట్ ఫిల్మ్స్ ను కలిపి ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా తయారు చేయండి

బిగ్ స్క్రీన్ మీద ఫీచర్ ఫిల్మ్ లో దర్శకుడిగా తన పేరును చూసుకోవాలని ప్రతి ఫిలింమేకర్ కు ఒక కల ఉంటుందని, ఆ కలను నిజంచేయడం కోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తరపున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. యంగ్ ఫిలింమేకర్స్ తాము తీసిన షార్ట్ ఫిల్మ్స్ ల నుండి తమకు నచ్చిన 3 లేదా 4 షార్ట్ ఫిల్మ్స్ లను వాటికి తగిన ఇంటర్ లింకులతో కలిపి ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా రూపొందిస్తే వాటిని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా ప్రదర్శించుకోవడమే కాకుండా సంబంధిత ఓటిటి సంస్థలకు ఇచ్చేలా ప్రయత్నం చేద్దామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినీవారంలో 2021, ఆగస్టు 28న ‘కళ్యాణ్ మీట్స్ జానీ భాయ్’ మరియు ‘నేను కూడా ప్రేమించా’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణ చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా.. హరికృష్ణ మాట్లాడుతూ… గతంలోనూ ఎపిసోడిక్ సినిమాలు వచ్చాయని, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిస కథలతో సత్యజిత్ రే 1961లో తీన్ కన్య అనే ఎపిసోడిక్ సినిమా తీశాడని, ఓటిటి ప్లాట్ ఫాంలు వచ్చిన తరువాత ఎపిసోడిక్ సినిమాల హవా మరింతగా పెరిగిందని, వాటికి తగినట్టుగా యంగ్ ఫిలింమేకర్స్ తమకు నచ్చిన చిన్నిచిన్న కథలతో ఎపిసోడిక్ సినిమాలు తీసి సినిమారంగంలో తనదైన ముద్ర వేసుకోవచ్చని అన్నారు.
ఈనాటి సినీవారంలో ‘ప్రేమించిన యువతి కోసం తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపించడానికి సిద్ధమైన డబ్బున్న యువకుడికి, ఒక పల్లెటూరి యువకుడు తల్లిదండ్రుల గొప్పదనాన్ని తెలియజేసే’ నేపథ్యంలో తిరుషాడో దర్శకత్వం వహించిన “కళ్యాణ్ మీట్స్ జానీ భాయ్”, ‘కాఫీషాప్ లో కూర్చున్న ఒక దర్శకుడు మరియు రచయితకు అదే షాపులో ఉన్న ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కి మధ్య జరిగే సన్నివేశాలను కథగా రాసుకునే’ నేపథ్యంలో జోష్వా మనోహర్ దర్శకత్వం వహించిన “నేను కూడా ప్రేమించా” సినిమాలు సందేశాన్ని వినోదాన్ని అందించాయని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, తనకు ప్రోత్సాహం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment