* దీనశరణ్య ఎన్జీవో ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ
ఆలేరు, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు హైస్కూల్లో వేడుకలు నిర్వహించారు. దీనశరణ్య ఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆనందాన్ని పంచుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దీనశరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా మాట్లాడుతూ…ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ తెలంగాణ ప్రభుత్వంలో మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల విలీనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిందన్నారు. అర్బన్ డెవలప్మెంట్తో పాటు యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖల అదనపు బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారని సాయిబాబా పేర్కొన్నారు. జయేశ్ రంజన్ 1992 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారిగా కూడా ఆయన పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంతో సమర్ధవంతంగా పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమర్ధుడైన అధికారిగా 1992 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ను నియమించిండం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్ర మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖలో ప్రత్యేకంగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధికి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయని తెలిపింది. అలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందదాయకమని గుర్తుచేసుకున్నారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతోపాటు విద్యార్థులతో సంతోషాన్ని పంచుకోవడం అభినందనీయమని సాయిబాబా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగ కుమార్, సీహెచ్ కృష్ణ, గంగదారి శ్రావణ్ కుమార్, సాయి శివ తదితరులు పాల్గొన్నారు.

