జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

Mass baby shower ceremony for 2,000 expectant mothers organized under the aegis of Jubilee Hills MLA Naveen Yadav.
Mass baby shower ceremony for 2,000 expectant mothers organized under the aegis of Jubilee Hills MLA Naveen Yadav.
Spread the love

అంగరంగ వైభవంగా జరిగిన సామూహిక శ్రీమంతం
అన్న అనే మాటను సార్థకం చేసుకుని.. పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ అందజేసిన పేదల పెద్దన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

పోషకాహార వారోత్సవంలో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ మరియు కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతాలు,అన్నప్రాసన కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు* ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు.
కాబోయే తల్లులకు ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలతో నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేసి సామూహికంగా శ్రీమంతం చేశారు.
అన్నగా అండగా నిలిచి.. ఆడపడుచుల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూ, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా చిన్నారి తొలిసారిగా అన్నం రుచి చూసే మధురమైన, చిరస్మరణీయమైన అన్నప్రాసన కార్యక్రమాన్ని గద్వాల్ విజయలక్ష్మి గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు కలిసి నిర్వహించి చిన్నారులకు ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమనికి TPCC అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ గారుమంత్రులు,దుద్ధిల్లా శ్రీధర్ బాబు, సీతక్క, అజ్జరుద్దీన్ గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి గారు,మైనార్టీ నాయకులు ఫాహీం ఖురేషి గారు..ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ గారు, MLC అద్దంకి దయాకర్ గారు.. ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ గారు, మరియు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు,చిత్తం పర్ణిక రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, టీజీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సామ రామ్మోహన్ రెడ్డి గారు, గద్దర్ వెన్నెల గారు, కాల్వ సుజాత గారు, కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు, దీపక్దీపక్ జాన్ గారు,సరిత తిరుపతయ్య గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారుఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ,తదితరులు, హాజరయ్యారు..