‘బతుకమ్మ ఛాలెంజ్-2026’ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026’ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సదావకాశాన్ని యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి యువతకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని మంత్రి పేర్కొన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ జానపద కళలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఛాలెంజ్ దోహదపడుతుందని వివరించారు. విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ఛాలెంజ్‌ను విజయవంతం చేయాలని మంత్రి కోరారు
