నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్

Today, I received an honor I had never imagined in my life: Padma Shri Dr. Rajendra Prasad.
Spread the love

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్‌ యజమాని మరియు నటుడు రాజారెడ్డి, తో పాటు శ్రీనివాస్‌రెడ్డిలు స్పాన్సర్స్ గా సహకరించారు. వారు రాజేంద్రప్రసాద్‌గారికి బొకేను అందజేసి పూలమాల వేసి శాలువా తో సత్కరించగా… ఫిలిం క్రిటిక్స్ గౌరవఅధ్యక్షులు ప్రభుగారు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావుగారు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటిగారు కలిసి బొకేను అందజేసి మొమెంటోను రాజేంద్రప్రసాద్ కి అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా.. చలాకీగా.. చాకచక్యంగా.. చక్కని మాటలతో తీయని తేనె వంటి పలుకులతో ఆడిటోరియంలో అందరినీ ఉత్సహపరిచారు ఫిలిం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ్‌గారు.
ఈ సందర్భంగా…ఫిలిం క్రిటిక్స్‌ గౌరవ అధక్షులు ప్రభు మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఫిలిం క్రిటిక్స్‌ వారు ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. కానీ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన కారణం స్పాన్సర్స్‌ రాజారెడ్డిగారు శ్రీనివాస్‌రెడ్డిగారు దొరకడం చాలా ఆనందం. వారు ఉండబట్టే ఈ కార్యక్రమానికి ఇంత చక్కని గ్రాండియర్‌ వచ్చింది. బేల్ ట్రీ హోటల్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఐదు దశాబ్దాలుగా మమేకమైన ఒక విశిష్టత కలిగిన నటుడు డా. రాజేంద్రప్రసాద్‌గారి గురించి ఏమి చెప్పినా తక్కువే. ఆయన నట జీవితం అనేది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో మంది హాస్యనటులు హీరోలుగా చేశారు. కానీ మొట్టమొదటి సారిగా నాకు తెలిసి హాస్య రసానికి హీరోయిజాన్ని పరిచయం చేసింది మాత్రం రాజేంద్రప్రసాద్‌గారే. హాస్యరసాన్ని పండించాలంటే చాలా కష్టం. దానికి ఒక గౌరవ ప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారు. గొప్ప నటనా ప్రస్ధానాన్ని తీసుకురావడం చాలా ఆనందం. నూతనంగా ఎన్నికైనా కార్యవర్గాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మంచి మంచి కార్యక్రమాల్ని చేసుకుంటూ వెళుతున్నందుకు ఫిలిం క్రిటిక్స్‌లోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్‌ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం పని చెయ్యడమే కానీ మాట్లాడటం రానివాడ్ని నేను. రాజేంద్రస్రసాద్‌గారి గురించి చెప్పాలంటే మా ఇంట్లో పెద్దన్న లాంటివారు. ఆయన నా కుటుంబ సభ్యులతో సమానం. ఆయన తెరమీద ఏమి ఏమి చేసేవారో నేను నిజ జీవితంలో అవన్నీ చేసేవారిని. ఆయన పేరు ప్రసాద్‌.. నా పేరు ప్రసాద్‌ ఆయన్ని సినిమాల్లో చూసి నేను బయట చాలానే చేసేవాడ్ని. ఈ సన్మానం ఆయన్ని సన్మానించినట్లు కాదు మన కుటుంబంలో ఒక వ్యక్తిగా మనల్ని మనం సన్మానించినట్లు అనుకుంటున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్‌ సెక్రటరీ సురేష్‌కొండేటి మాట్లాడుతూ… ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సత్కారాలు వేరు ఈ సతక్కరం వేరు అనే విధంగా చేయడానికి సహకరించిన రాజేంద్ర ప్రసాద్‌ గారికి ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కృష్ణా పత్రికలో పని చేస్తున్నప్పుడు అది చాలా చిన్న పత్రిక నేను రాజేంద్రప్రసాద్‌గారి వద్దకు వెళ్ళాను. ఆయన నాది ఏ పత్రిక అది చిన్నదా.. పెద్దదా అని చూడలేదు. ఆయన నా పై చూపిన ప్రేమ ఎనలేనిది. రాజేంద్రప్రసాద్‌గారిని కలిస్తే చాలు అనుకునే వారిలో నేను ఒకడ్ని. అలాంటిది ఆయన్ని ఆరోజు దగ్గరనుంచి చూశాను. ఏ మాత్రం గర్వం లేకుండా నాతో చాలా చక్కగా మాట్లాడారు. నా ఈ జర్నలిజం ఎదుగుదలకు తోడ్పాటుగా ఉన్నారు. అంతేకాక బాపుగారి సినిమాలో నన్ను ఆయన మొట్ట మొదటిసారి నటుడ్ని చేశారు. బాపుగారి సినిమాలో నటించడం అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. ‘మా’ అసోసియేషన్‌ లో కూడా మేము కలిసి పని చేశాము. ఆ విధంగా కూడా మాకు ఆ అనుబంధం ఉండేది. అసోసియేషన్‌లో ఒక్కరూపాయి కూడా తీయకుండా పని చేసేవాళ్ళం. అలా చేయడం నేను ఆయనే దగ్గరే నేర్చుకున్నాను. అదే విధంగా మా ఫిలిం క్రిటిక్స్‌ టీమ్‌ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు. పేరు పేరునా మా టీమ్‌ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
నటులు బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి వచ్చిన నా అన్నలందరరికీ థ్యాంక్స్‌. మేం తిరుమల కొండ పైన పుట్టి పెరిగాం. ఫ్యామిలీ మొత్తం చూడాలంటే కేవలం రాజేంద్రప్రసాద్‌గారి సినిమాలే చూసేవాళ్ళం. అలాంటి ఒక టైంలో రాజేంద్రప్రసాద్‌గారు కొండపైన ఒక గెస్ట్‌ హౌస్‌ని నిర్మించారు. నేను ప్రతి రోజు ఆయనను చూడడానికి అక్కడికి వెళ్ళేవాడిని ఆయన కనిపిస్తారేమో అని. కానీ ఆయన అక్కడ ఉండేవారు కాదు. అప్పట్లో తిరుపతికి ఎవరైనా వస్తే రాజేంద్రప్రసాద్‌గారి గెస్ట్‌ హౌస్‌లో ఉన్నాం అనేవారు. ఆయనకు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గెస్ట్‌ హౌస్‌ కట్టడం అంటే మాములు మాటలు కాదు. నేను ఈ రోజు సార్‌ని కలవడం చాలా ఆనందం. సార్‌ లాంటి గొప్ప వ్యక్తులు చూసి ఎదగొచ్చు. ఆయనను నేను చాలా విషయాల్లో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవాడ్ని. అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఫస్ట టైం ఏ మూవీ ఏ ఒక్క యాక్టర్‌ని కలవలేదు. ఆయనని కలవడానికి ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా భావిస్తున్నాను అన్నారు.
వైస్‌ ప్రెసిడెంట్‌ జనార్ధన్‌గారు మాట్లాడుతూ…రాజేంద్రప్రసాద్‌గారితో నాకు అహనా పెళ్ళంట, లేడీస్‌ టైలర్‌ ఇలా చాలా సినిమాలకు నేను పని చేశాను. ఆయన ఒకానొక సమయంలో నాతో జనా నేను 30 ఏళ్ళుగా పని చేస్తున్నాం చేస్తూనే ఉంటాం అన్నారు. ఆయనకు ఇంకా ఎన్నోఅవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
వైస్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ మాట్లాడుతూ… రాజేంద్రప్రసాద్‌గారికి ఇంత పెద్ద అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో 2004లో ఇద్దరం ఒకేసారి అవార్డు తీసుకున్నాం. రాజేంద్రప్రసాద్‌గారికి మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ మామిడాల గిరిధర్‌ మాట్లాడుతూ… నేను చాలా అదృష్ట వంతుడ్ని ఆయన ఫస్ట్‌ సినిమా నుంచి నేను ఆయనతో కలిసి పని చేశాను. ఈనాడులో పని చేస్తున్నాను. ఎక్కడో స్ట్రింగర్‌ గా పని చేసేవాడిని కానీ ఆయనకు అలాంటి భావన లేదు. ఆయన వల్లే నేను ఫిలిం జర్నలిస్ట్‌ని అయ్యాను. ఆయన ఇచ్చిన ప్రోత్సహం ఎంతో ఉంది. ఆర్టిస్టులతోటి మాట్లాడటం మాకు అదొక అనుబంధం సినిమా జర్నలిస్ట్‌ అవ్వడానికినాకు మీరు భీజం వేశారు అంటూ ఆయన వేదికపైన ఎమోషనల్‌ అయ్యారు. ఈ అవార్డు వచ్చినందకుకు ఎవ్వరికీ కూడా ఇంత కూడా అసూయ లేదు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆల్‌మోస్ట్‌ 40 సంవత్సరాలు అనుబంధం అలానే కొనసాగుతుంది థ్యాంక్యూ అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఆర్‌.డి.ఎస్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. రాజేంద్ర్రసాద్‌గారికి రెండు ఏళ్ళ తరువాత పద్మ విభూషణ్‌ కూడా రావాలి. ఆ ఫంక్షన్‌ కూడా ఫిలిం క్రిటిక్స్‌ వారు చేయాలి. ఆయనను నేను గతంలో ఇంటర్వ్యూ అడిగాను. ఫుల్‌ బిజీగా ఉన్నారు. కానీ లంచ్‌ బ్రేక్‌ తరువాత టక్కున్న మమ్మల్ని పలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నాకు ఒక మాట చెప్పారు. మన పని గొప్పది కానీ మన పని చేసే అవకాశం ఇంకా గొప్పది అన్నారు. సింగీతం శ్రీనివాస్‌గారితో అందరితో పని చేశారు. అందరితో హిట్స్‌ ఉన్నాయి. కృష్ణారెడ్డిగారులాంటి వారు మనకి లభించారంటే ఆయన వెనుక రాజేంద్రప్రసాద్‌గారు లాంటి నటులు ఉండడం చాలా ఆనందం అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, నవీన్‌ మాట్లాడుతూ… చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి చాలా ఇష్టపడ్డాం. మా నాన్నగారు మీకు ఫ్యాన్‌. ఇంటిల్లపాది కలిసి చూడదగ్గ సినిమాలు మీరు ఎన్నో చేశారు. మీకు మరిన్ని అవార్డులు రావాలి అన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ బాలిరెడ్డిగారు మాట్లాడుతూ… భారత దేశ ప్రభుత్వం గర్వించతగ్గ స్ధాయిలో అవార్డు గ్రహీత డా. రాజేంద్రప్రసాద్‌ గారికి అసోసియేషన్‌ తరపున హృదయపూర్తక అభినందనులు. ఆయనకు నాకు 1986 నుంచి పరిచయం. కొంతమంది కెమెరా ముందు నటిస్తారు. రాజేంద్రప్రసాద్‌గారు కెమెరా ముందు కెమెరా వేనక నటన కాకుండా సహజంగా జీవిస్తారు. కెమెరా చూస్తూనే పక్కన జర్నలిస్టులను కూడా నవ్విస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ కూడా కాంట్రవర్సి లేని మనిషి. ఈ అవార్డు రావడం మన అందరం గర్విచదగ్గ విషయం అని అన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ మోహన్‌ గోటేటి మాట్లాడుతూ… మన సంస్థ అధ్యక్షులు భత్తులప్రసాదరావుగారికి, సురేష్‌కొండేటిగారికి అందరికీ నమస్కారం. రాజేంద్రప్రసాద్‌గారిని మేం ఆల్‌ రౌండర్‌ అని పిలుచుకునేవాళ్ళం. ఆయన తోటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ ఒక్కటీ అడక్కు వేలాది మంది మధ్య అవుట్‌డోర్‌ షూటింగ్‌ చేసేవారు. చుట్టూ ఎంత గొడవగా ఉన్నా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయేవారు. అంత నిబద్ధతతో ఉండేవారు. అలా చెసే నటులు చాలా అరుదుగా ఉంటారు. మాస్టారు కాపురం టైటిల్‌ నేనే పెట్టాను. అప్పట్లో ఆ చిత్ర కథని ముందుగానే చెప్పి టైటిల్‌ పెట్టమని మన జర్నలిస్టులకి చెప్పారు. అప్పుడు నా టైటిల్‌ ఫైనల్‌ అయింది. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు నాకు వెయ్యి నూట పదహార్లు డబ్బును కూడా ఆయన ప్రొడ్యూసర్‌గారితో ఇప్పించారు. ఆయనది ఇప్పటికీ చిన్న పిల్లాడి మనస్తత్వం. 17ఏళ్ళ వయసులోనే ఆగిపోయారు ఆయన. ఆయనతో ఒక్కపూట ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చేయని క్యారెక్టర్ లు అంటూ ఏమీ ఉండవు. ఎలాంటి క్యారెక్టరు ఇచ్చినా ఆయన అలవోకగా చేసేస్తారు. కమల్‌ హాసన్‌ గారు విభిన్న పాత్రలు చేశారు అంటారు. కానీ ఈయన చెయ్యని కర్యారెక్టర్‌ లేదు. మెగాస్టార్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాగా ఉండేవారు. రాజేంద్రప్రసాద్‌గారు నటించనన్నా ఇండస్ట్రీ ఊరుకోదు. అభిమానులు ఊరుకోరు ఇంటికి వచ్చి తీసుకొస్తారు. లేటుగా వచ్చినా రైట్‌ పర్సన్‌కి అవార్డు వచ్చింది. అందుకు మీకు సుభాభినందనలు అన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉమర్‌జీ అనురాధ మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఫిలింక్రిటిక్స్‌ వారికి చాలా థ్యాంక్స్‌. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మెమెంటోలు ఇవ్వడానికి ఆయన మాకు నాగేశ్వరావుగారి చేత అవార్డు ఇప్పించారు. దాని వల్ల మేము కూడా పేపర్‌లో వస్తామని ఆలోచించి ఆయన అక్కినేనిగారితో మాకు అవార్డును ఇప్పించారు. నేను సితార నుంచి జర్నలిస్ట్‌గా వచ్చిన్నప్పుడు… నేను ఇక్కడ కొన్ని విషయాలను చెబుతాను. ఆంగికాభినం. వాచకాభినయం, సాత్రవికాభినయం అనేవి కొన్ని ఉంటాయి. చుట్టంముక్క. అనే డైలాగ్‌ వెటకారం అనేది ఆయన పలికించినట్లు ఎవరూ పలికించలేరు. బాపుగారి సినిమాల్లో ముందుగా ఎవరైనా చూసేది హీరోయిన్లవైపే. కానీ రాజేంద్రప్రసాద్‌గారు పలికించిన డైలాగులు. గదిలోకి తీసుకెళ్ళి మర్డర్‌ చేస్తారా అనే వ్యంగ్యంగా మాట్లాడే తీరు మరెవ్వరికీ రాదు. దాక్కున్నావ్‌ కదా అనే పదాల్లో స్ట్రెస్‌ ఇస్తే ఒక చమత్కారం ఇస్తారు అదే ఆయన స్పెషాలిటీ. వీరు నటించిన సినిమాల్లో ఈయన వైపు కూడా చూస్తూ ఉంటాం. పెళ్ళి పుస్తకంలో కొన్ని సీన్స్‌లో ఆయన నటన నా భూతో నా భిష్యత్తు హాస్య రసాన్ని పలికించడంతో పాటు ఎమోషన్స్‌ని పలికిస్తుంటారు రాజేంద్రప్రసాద్‌గారు. నాకున్న మెమొరీస్‌ లో ఒకటి చెబుతాను. సితారలో పని చేస్తున్నప్పుడు. రాజేంద్రప్రసాద్‌ హీరో కేరాఫ్‌ మోహన్‌గోటేటి పేరుతో అనేక లవ్‌ లెటర్స్‌ వచ్చేవి. అవన్నీ కూడా మోహన్‌గారు నన్ను చదవమనేవారు. ఆమె చాలా చక్కగా బావా అంటూ ఉత్తరంలో మొదలుపెట్టేది. అవి చదువుతూ..ఏంటి సార్‌ మాకు ఈ బాధ అనేదాన్ని నేను. ఆమె ఆపకుండా 7,8 నెలల పాటు ఉత్తరాలు రాస్తూనే ఉండేది. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు అభినందనలు సార్‌ అన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ… రాజేంద్రస్రసాద్‌గారి గురించి మాట్లాడటానికి నాకు పెద్దగా అర్హత లేదు కానీ . నేను పని చేస్తున్నప్పుడు నాకు అహనా పెళ్ళంట సినిమా సమయంలో నాకు ఒక డవుట్‌ వచ్చింది. ఒక్క స్టంటు ఫైట్లు లేకుండా సినిమా బయటకు రావడం ఆనందంగా అనిపించేది అన్నారు. చిన్నప్పటి అనుభాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని మంచి నటులుగా మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉడయవర్లు మాట్లాడుతూ…సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో వారితోనే మాట్లాడించాలి. కానీ మనం మాట్లాడుతూన్నాం. రాజేంద్రప్రసాద్‌గారికి పద్మశ్రీ వచ్చింది. నాకు నవ్వుగా ఉంది. ఎందుకంటే అంతకన్నా పెద్ద అవార్డు రావాలి. హాస్యరసం చాలా క్లిస్టమైన రసం . దాన్ని మించిన రసం మరొకటి లేదు. దేశ ప్రధాని అయిన పీవి నర్సిమరావుగారే ఆయనకు అభిమాని అంటే హాస్యం ఎంత ఇష్టమో ఆలోచించండి. పి.వి.నర్సింహారావుగారికి ఒకసారి సత్కారం చేశారు. ఆ సత్కారానికి నేను వెళ్ళాను. ఈ వయసులో కూడా ఇంత టెర్షన్‌ ఎలా భరిస్తున్నారు అని నేను ఓ విలేకరిగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా నేను టెన్షన్‌ అనిపించినప్పుడు రాజేంద్రస్రసాద్‌గారి సినిమాలు చేస్తాను అన్నారు. అప్పట్లో ఆ వార్తను నేను ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రచురించాను అన్నారు.
సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ భూషన్‌ మాట్లాడుతూ… నటకిరీటి రాజేంద్రప్రసాద్‌గారికి ధ్యాంక్స్‌ నా జీవితంలో ఆయన సినిమా వల్ల చాలా దెబ్బలు తిన్నాను. నా చిన్న తనంలో కాస్మోరా అని సినిమా రిలీజ్‌ అయింది. స్కూల్‌ ఎగరగొట్టి సినిమాకి వెళ్ళాను. సినిమా చూసి పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్ళాను బట్టలు విప్పి చెరువులో ఈత కొట్టి పైకి వచ్చేసరికి బట్టలు ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ డ్యూటీ నుంచి వచ్చింది. ఆ సినిమాలో ఆ హీరోకు బట్టలు లేవు నీకు బట్టలు లేవు అంది. ఎర్రమందారం సినిమాకు అవార్డు వచ్చింది. నిజాం కాలేజీ గ్రూండ్‌లో ఆ ఫంక్షన్‌ జరిగింది. నేను కవరేజికి వెళ్ళాను. అదే సంవత్సరం దాగుడు మూతల దాంపత్యం సినిమాకు కవరేజ్‌ కోసం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఫొటోగ్రాఫర్‌ సతీష్‌ డ్యూటీ ఆయన నన్ను కూడా రమ్మన్నారు. నేను కూడా ఆయనతో కలిసి వెళ్ళాను అన్నారు.
రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ…సభా సరస్వతికి నమస్కారం. ఇది కలా నిజమా… నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది. కలా నిజమా 48ఏళ్ళ సినీ జీవితంలో ఒక కళా కారుడుగా నేను సినిమాల్లో యాక్ట్‌ చేసినప్పటి నుంచి నా బిహేవియర్‌లో ఎలాంటి మార్పు లేదు. మన జర్నలిస్టులో ఎవ్వరు ఎప్పుడు ఈ ఫిల్డ్ లోకి వచ్చినా మనమందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం కలిసే భోజనం చేశాం. కలిసే మాట్లాడుకున్నాం. కలిసే ఉన్నాం. నేను ఒక నటుడ్ని అని నేను ఎప్పుడూ గర్వం చూపించలేదు. మనం ఒక ఫ్యామిలీ మెంబర్‌. నాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని అడ్డంగా వాడేశాను ప్రభుని నాకు కొంచం సహాయం చేయాలి అన్నాను. ఆ నలుగురు సినిమా విడుదల సమయంలో తనతో చిన్న ప్రెస్‌మీట్‌ లాగా పెట్టి ఈ సినిమా తీసేయడానికి కారణం ఏమిటో నాకు తెలియదు. ప్రభు నీ సినిమాకి ఎందుకు వస్తారు. మా టెన్షన్ అంతా పోతుంది. నువ్వేంటి థియేటర్‌ బయట ఇలా నిలబడి వున్నాం ఏంటి. నీ సినిమా అంత సీరియస్‌గా ఉంటే ఎవరు చూస్తారు అని ప్రభు అన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి వస్తాం. మరి అలాంటిది ఈ సినిమా ఎలా చూస్తాం. అన్నారు. ఏ మనిషి అయినా చచ్చిపోయాక ఎలా తెలుస్తుంది. పిచ్చోడా ఈ సినిమా చచ్చిపోవడంతోనే సినిమా స్టార్ట్‌ అవుతుంది. సినిమా అంతా అప్పుడే జోకులు స్టార్ట్‌ అవుతాయి అన్నాను. అవునా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ… నేను నా స్నేహితులతో కలిసి చూస్తాను అన్నాడు. చూశాడు. ఏమి చేశాడో తెలియదు. ఏ థియేటర్‌లో తీసేశారో అదే థియేటర్‌లో 100 రోజులు ఆ సినిమా ఆడింది. ఆ నలుగురు ఎంత ఫన్‌ చేశావు అన్నయ్య అన్నారు. నేను రామారావుగారి ఇంట్లో పుట్టినా. మా నాన్నగారు నిమ్మకూరులో మాస్టారు. ప్రభు.. సురేష్‌ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. మనమందరం కలిసే పెరిగాం. నాకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేవు. ఈ మధ్య కాలంలో అదేదో ట్యూబులో.. టైర్లో ఏవో వచ్చాయి కదా. కొత్తగా లేటెస్ట్‌గా ఏమన్నా నా అంతలా నవ్వించడం వారికి చాతకాదేమో. దానికి నేనేమి చెయ్యాలి. నన్ను ఎవరైనా తప్పుగా అర్ధం చేసుకుంటే ప్రసాద్‌ అది వాడి ఖర్మ. నేనేమీ చేయలేను. రాజేంద్రప్రసాద్‌ కామెడీ హీరోనా. రాజేంద్రప్రసాద్‌ ఏమిటి సీరియస్‌ కూడా చేస్తారా ఇతను. ప్రసాద్‌ నువ్వు ఒకటేనయ్యా. నువ్వు ఒకటే అయ్యా తెలుగువారింట్లో ఒక మంచి.. ఒక కంచం ఒక రాజేంద్రప్రసాద్‌ అంతే అన్నారు. రెండు చేతులతో బాణాలు వేస్తున్నావు అన్నారు సి. నారాయణరెడ్డిగారు. హాలీవుడ్‌ లో పని చేసేవారిని ఎవరినైనా కూర్చోబెట్టి ఉదయం లేడీస్‌ టైలర్‌. మధ్యాహ్నంఅహనా పెళ్ళంటా సినిమాల వెయ్యండి. వాడెవరు వీడెవరు అనకపోతే నా పేరు మార్చుకుంటా. యాక్టర్‌గా అలాంటి అవకాశాలు రాకపోతే నాకు ఇంత మంది అభిమానులు ఉండరు. కోడిని కట్టేసి కోడి కూర తింటారా. హాట్సాఫ్‌ టు జంధ్యాల గారు. వారందరూ లేనిదే నేను ఎక్కడ ఉన్నా. అంతమంచి రచయితల వల్లే నేను ఇలా ఉన్నాను. వారు రాసారు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. నిజమే పద్మశ్రీరావడం ఆలస్యం అయింది. ప్రతి తెలుగు వారి ఇంట్లోను రాజేంద్రస్రసాద్‌ ఉన్నారు. నాకు ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ నేను ఐదు జనరేషన్లు దాటి వచ్చాను. ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌ ఇప్పుడు జనరేషన్ వరకు అందరికి పరిచయం అందరికీ పరిచయం ఉన్నాను. అదే స్వామి మనకి ఇచ్చేటటువంటి దేవుడు ఇచ్చిన ప్రసాదం. నాకోసం ఇప్పుడున్న దర్శకులు నా మీద ఉన్న బాధ్యతతో మంచి మంచి క్యారెక్టర్లు రాస్తారు. ఎక్కడా రిలాక్స్‌ అయ్యే మనస్తత్వం కాదు నాది. జర్నలిస్టులు ఒక ఆర్టిస్టు గురించి మాట్లాడటం చాలా ఆనందం. మీ ఫ్యామిలీ మెంబర్‌గా మీలో ఒకడిగా నేను చనిపోయేంతవరకు ఇలానే ఉంటాను. ఫిలిం క్రిటిక్స్‌ నా సొంత మనుషులతో సమానం. ఈ సన్మానం నాకు మంచి బూస్ట్‌ అప్‌ ఇచ్చారు. మిమ్మల్ని నా మనసులో పెట్టుకున్నాను అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు
ప్రశ్నలు.. జవాబులు…
పద్మశ్రీల రేసులో వెనకబడ్డారో… నిర్మాతగా మీ నుంచి సినిమాలు ఆశించవచ్చా?
అవార్డు గురించి నేనే ఏమీ ఫాలో చేయలేదు. ప్రభు ఒకసారి అన్నయ్య నువ్వు అవార్డు తీసుకోవాలంటే పీ.వి. నర్సిహరావుగారు అడిగితే ఇవ్వరా అన్నాడు. మనం డిజర్వ్‌ చేయాలి. అడిగితే బిక్ష అవుతుంది. ప్రపంచంలో తెలుగువారందరూ లేటు అయినా డిజర్వ చేయాలి.
నేను నా లైఫ్‌లో మంచి సినిమాలు తీద్దామని మేడం.. రాంబంటు మా ఆవిడ విజ చాముండేశ్వరి ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. నంది అవార్డులో ఆ సంత్సరం మేడం సినిమా వేసి చూపిస్తే అక్కినేని నాగేశ్వరరావు బెస్ట్‌ యాక్టరస్‌ అవార్డు ఇచ్చారు. జ్యూరీ అవార్డు ఫర్‌ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సపోర్టింగ్‌ ఇవ్వమంటారా అంటే కాదు. ప్రసాద్‌ దాన్ని ఎంతో గట్స్‌తో పెర్‌ఫెక్ట్‌ గా చేశారు. స్పెషల్ జ్యూరీ యాక్ట్‌ట్రెస్‌ అవార్డు ఇచ్చారు. నెక్స్‌ట్‌ రాంబంటు తీశాం. మనం ప్రొడ్యైసర్‌గా పనికిరాం అనుకున్నాను. అన్నపూర్ణ స్టూడియో పక్కన అరెకరం అమ్మేశాం. నేనేదో నా పని చేసుకుంటూ పోవడం నేను ఫెయిల్యూర్‌ ప్రొడ్యైసర్‌ని అని జీవితం లో ఎప్పుడూ ప్రొడ్యూసర్‌ అనే పోస్ట్‌ని విరమించుకున్నా అన్నారు.
మీరు చేసిన ఇన్నిపాత్రల్లో అతి కష్టం అనిపించింది ఏది?
మా ఇన్‌స్టిట్యూట్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్టూడెంట్స్‌ మాకు ఎంత కాంప్లికేట్‌ క్యారెకట్ఱ ఇస్తే అంత బాగా చేయాలి. మాకు ఇన్‌స్టిట్యూట్‌లో యాసిడ్‌ టెస్ట్‌ అని ఉండేది. ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా దానికి డబుల్‌ చేసి చూపించాలి అన్నారు. ఒకసారి నా పోస్టర్‌పైన పేడ వేశారు. నేను ఎన్టీరామారావుగారికి చెప్పాను దానికి ఆయన నవ్వారు. ఏంటి మీరు నవ్వుతున్నారు అన్నాను. మరి అందరి పోస్టర్లమీద వేస్తారా అన్నారు ఆయన. అదే మేమయితే ఎన్‌టీవోడు ఏం చేశాడు అంటారు తెలుసా. ఎవడో నువ్వు పెరుగుతున్నావని వాడికి కడుపు మంట. అలా నేను చేసిన క్యారెక్టర్లలో కష్టమనిపించిన ఒక్క క్యారెక్టర్‌ కూడా నాకు లేదు. సరదా సరదాగానే. తమిళ హీరో సూర్య నా ఫ్యాన్‌ అన్నారు . ఓ బేబి క్యారెక్టఱ్ మాములు కాదు. అన్నారు. చిరంజీవి సుస్మిత నాతో సినిమా తీసింది. నాన్న ఫస్ట్‌ కాపీ చూశాను. నాన్న రాజేంద్రప్రసాద్‌ అంకుల ఏమి చేశారు అంది. గోల్డెమెడలిస్ట్‌ బాగా చేయకపోతే చెప్పాలి చేయడంలో గొప్పేంటి అన్నారు.
అవార్డులు రావడానికి వేరే ఒక దారి ఉంటుంది?
తను ఏ రీజనతో అన్నారో నాకు తెలియదు. తిరుపతి నుంచి బయటకి వచ్చాక. స్వామి నాకు ఈ అవార్డు ఇప్పించారు అన్నాను. నాకంత సీన్‌ లేదు అని చెప్పాను. అంటే నాకు అంత సీన్‌ లేదు అని ఎవరో హెడ్డింగ్ పెట్టాడు అది నా నాల్డెజ్‌. ఇలాంటివి ఏదన్నా విన్నా మర్చిపోండి. వేరే ఉద్దేశాలు ఉండవు.
లేడీస్‌ ట్రైలర్‌.. డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ అన్నటైంలో కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు చేయడం ఆలోచన మీకు వచ్చిందా మీ ప్రొడ్యూసర్లదా
ఎస్‌.పి. వెంకన్న చిరంజీవి జంధ్యాలగారితో చంటబ్బాయి తీస్తున్నాడు. అతన్ని అలా వేసి న్ను ఇలా వేశారు. చి చీ.. మళ్ళీ ఎప్పుడన్నా ఫూట్‌ చేయడం చేశావా. 18రోజుల్లో సినిమా తీశాం. ఎదురింటి అబ్బాయి పక్కింటి పెళ్‌ళాం. బడ్జెట్‌ ఎంతను కుంటున్నారు. ఎంత పెద్ద హిట్‌ అయింది. అందులో ఉన్న కంటెంట్‌ అందులో ఉన్న విషయం. ఇవాల్టిక కూడా ఆ క్రియేటర్స్‌ నేను దణంవ పెట్టుకుంటా.
రాంబంటు అసంతృప్లి కలిగించింది.
ఏ బండికైనా ఇది మేక్‌లో ఉన్న ప్రాబ్లం మా పేరెంట్స్‌ అంతే. మా నాన్నగారు నిమ్మకూరు. ఎన్టీరామారావుగారి ఇంట్లో ఉన్నవాళ్ళు మరి కృష్ణ బైక్‌ ఎక్కించుకుని అల్లరి చేస్తే అంత స్ట్రిక్ట్‌ మా నా్న ఎలా బిహేబ్‌ చేస్తారు అనేది మా నాన్న బయటకు వెళ్ళినప్పుడు మా ఆన్నా లాగా యాక్ట్‌ చేసి చూసించేవాళ్ళం. చిన్ప్పటి నుంచి అంతేఅల్లరి గోల. వంశీ లాంటి డైరెక్టర్‌ జంధ్యాల రేలంగి లాంటి దర్శకులు చాలా ఆనందపడ్డాను. నన్ను గిల్లిగిల్లి చేయించుకునేవారు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీలో ఆయనకు అవకాశం చి్చంది నేనే. ఈవివి క్లోజప్‌ తీసుకుంటాను. మీరు ఎక్స్‌ప్రెషన్‌ కావాలి కొత్తగా కావాలి అన్నారు. మీరు వంశీలకు వారికే చేస్తారా ఈవీవీని డైరెక్టర్ని చేసిందే నేను. నా కోసం చేసుకునన్నాను. కెమెరా కట్ చెప్పకుండా నవ్వుతూ కిందపడి డొల్లుతున్నాడు. కట్‌ చెప్పవయ్యా అని మళ్ళీ చెబితే అప్పుడు కట్ అన్నాడు.

Related posts