సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ చిత్రంలో ‘కావాలయ్యా..’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటపై స్టెప్పులేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్‌ను పరుగెత్తించారు. అయితే, తాజాగా ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘కావాలయ్యా’ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక నేను కొంత అసంతృప్తికి లోనయ్యాను. ఎందుకంటే ఆ పాటలో నేను ఇంకాస్త బెటర్‌గా డ్యాన్స్ చేసి ఉండాల్సింది అని నా మనసుకు అనిపించింది” అంటూ ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను పూర్తిగా సంతృప్తి చెందలేదని తమన్నా ఓపెన్ అయింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన అఫీషియల్ యూట్యూబ్ వ్లాగ్‌లో భాగంగా తమన్నా ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్‌లో తమన్నా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఇదే ఇంటర్వ్యూలో తమన్నా తన డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే నేను ప్రొఫెషనల్ గా శిక్షణ పొందిన డ్యాన్సర్‌ను కాదు. అందుకే నా తాజా హిట్ సాంగ్ ‘ఆజ్ కీ రాత్’ కోసం ఏకంగా 15 రోజుల పాటు కఠినంగా రిహార్సల్స్ చేశాను. అంత సమయం కేటాయించి పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాకే సెట్స్‌పైకి వెళ్లాను” అని పేర్కొంది. కాగా, అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మాస్ ట్యూన్ అందించిన ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయింది.
‘ఆజ్ కీ రాత్’ కోసం మిల్కీ బ్యూటీ..
