మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు పెళ్లి పుకార్లతో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో కూడా సంయుక్త పెళ్లి గురించి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు స్వయంగా స్పందించిన సంయుక్త మీనన్… తన దృష్టి పూర్తిగా కెరీర్‌పైనే ఉందని, ప్రస్తుతం వివాహంపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా మళ్లీ ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న సంయుక్త… తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలతో కెరీర్‌లో అత్యున్నత దశలో ఉంది. వరుస హిట్లతో “గోల్డెన్ లెగ్”గా పేరుతెచ్చుకున్న ఈ హీరోయిన్… దర్శకుల ఫేవరెట్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు రష్మిక మందన్నమాదిరిగానే సంయుక్త కూడా పెళ్లి తర్వాత తన కెరీర్‌ను కొనసాగించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగడం సాధారణమవుతోంది. ఇప్పటికే సంయుక్త మీనన్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పెళ్లి పుకార్లపై గతంలో క్లియర్‌గా స్పందించిన సంయుక్త… ఈసారి కూడా తనదైన శైలిలో ఈ వార్తలకు చెక్ పెడుతుందా? లేక నిజంగానే కొత్త జీవితానికి సిద్ధమవుతోందా? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చూస్తుంటే… సంయుక్త మీనన్ కెరీర్ జోరుగా సాగుతోంది.
పెళ్లి పుకార్లు ..మళ్లీ హాట్ టాపిక్ !?
