* ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంటుంది
* హీరో, నిర్మాత వడ్డే నవీన్ ఇంటర్వ్యూ…
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. . ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే..
* ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. కేవలం కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్ని ఇస్తే సరిపోవడం లేదు. అన్ని అంశాల్ని జోడించి సరికొత్త పాయింట్, కంటెంట్‌ను అందిస్తేనే ఆదరిస్తున్నారు. ఈ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కించాం. నాకు ఈ కథ మీదున్న నమ్మకం వేరే నిర్మాతలకు ఉండాలని లేదు. వేరే నిర్మాత అయితే కథ మారుస్తారని కాదు.. ఈ కథని నేను నమ్మాను. నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాను.
* త్రిమూర్తులు పాత్రలో ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానిస్టేబుల్ పాత్రకి తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తాను. ఈ సినిమా అయితే ప్రేక్షకులు ఊహించినట్టుగా రెగ్యులర్‌గా ఉండదు. సిస్టంలో ఉంటూనే పోరాడే కానిస్టేబుల్ పాత్రలో నేను కనిపిస్తాను. స్క్రిప్ట్ మీద ఏడాది పాటుగా పని చేశాం. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చాలా వరకు రియలిస్టిక్‌గానే ఉంటుంది. పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా ఉండదు. అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్, పాటలను పెట్టాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. నిర్మాణంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అయితే అన్నీ పక్కాగా ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదు. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. ఇప్పటికే జీ టీం ఓటీటీ హక్కుల్ని తీసుకుంది.
* దర్శకుడు కమల్ ఈ కథ మీద చాలా వర్క్ చేశాడు. మేం దాదాపు ఏడాది పాటుగా కేవలం స్క్రిప్ట్ మీదే ఉన్నాం. కమల్ మేకింగ్, టేకింగ్ చాలా కొత్తగా అనిపించింది. త్రిమూర్తులు భార్యగా రాశీ సింగ్ కనిపిస్తారు. ఆమె అద్భుతంగా నటించారు. ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. గత పన్నెండేళ్లలో మన తెలుగు ఆడియెన్స్ నేను ఎక్కడ కనిపించినా కూడా ‘మళ్లీ సినిమాలు చేయండి సార్’ అని ప్రేమగా అడిగేవారు. ఇప్పుడు మా సినిమా మీద, నా మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తున్నాను. వారి అభిమానానికి ఎప్పుడూ రుణపడే ఉంటాను.
* నేరుగానే పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు. కానీ ముందు నా మార్కెట్ ఎంత ఉందో తెలియాలి. పైగా అవతల ఉన్న పెద్ద దర్శకులకు నాతో చేయాలని కూడా ఉండాలి. ముందు నా సినిమా బయటకు వస్తే.. నా మార్కెట్ తెలుస్తుంది. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చూశాక మంచి సినిమా చేశాడు అనే ఫీడ్ బ్యాక్ ఇస్తారని మాత్రం ఆడియెన్స్ నుంచి వస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ మెంబర్లలో ఓ వంద మంది చూశారు. అందరూ చిత్రాన్ని చూసి సర్ ప్రైజ్ అయ్యారు. నన్ను నేను ప్రమోట్ చేసుకునేలా సినిమా తీసి ఉంటానని వాళ్లంతా అనుకుని ఉంటారు. కానీ కథ, కంటెంట్ ఇవన్నీ చూసి అందరూ షాక్ అయ్యారు.
* ప్రస్తుతం సోలో హీరోగా చేస్తున్నాను. అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. కథ నచ్చితే మల్టీస్టారర్ అయినా సరే చేస్తాను. కంటెంట్ నచ్చితే ఓటీటీ కోసం కూడా ప్రాజెక్ట్ చేస్తాను. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కథ నెమ్మదిగానే ప్రారంభం అవుతుంది. కానీ సంఘర్షణ మొదలయ్యాక.. క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా వెళ్తుంది. క్లైమాక్స్‌ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు.
