టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. లాఠీ సినిమాతో కెరియర్ ప్రారంభించి మొత్తానికి 30 ఏళ్ల పైబడిన కెరీర్‌లో మొత్తంగా 14 చిత్రాలు తెరకెక్కించాడు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్‌లో ఇన్ని జానర్స్‌లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. గుణశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు .. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్ ప్రసిడెంట్ జనార్థన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, చందు రమేష్, జిల్లా సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుణశేఖర్ 58 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ లోని సీనియర్ సభ్యులు తోటకూర రఘు, బాలిరెడ్డి, మోహన్ గోటేటి. ఉమా మహేశ్వరరావు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు తదితర సీనియర్ జర్నలిస్టుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
గుణశేఖర్ కు ఫిలింక్రిటిక్స్ బర్త్ డే విషెస్
