శ్రీనిధి శెట్టి : పాన్ ఇండియా బ్యూటీ…

Srinidhi Shetty: Pan India Beauty...
Spread the love

‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఓ నటిగా అన్ని రకాల జానర్‌ సినిమాలు చేయాలనుకుంటోంది. యశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్’ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హిట్ -3’లో కనిపించింది. ఇటీవల ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్‌, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలపై స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్‌ అవుతారో నిర్మాతలు డిసైడ్‌ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది. సీత పాత్రకు ఆడిషన్‌లో నన్ను సెలెక్ట్‌ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్‌ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది. శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన ‘కోబ్రా’ చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన ‘హిట్ 3’ ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం ‘తెలుసు కదా’లో ఓ హీరోయిన్‌గా చేసింది. ”అపజయం ఎదురైనప్పుడు జీవితం ఆగిపోయింది అనుకుంటే మనం ఆగిపోతాం… ఆ అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటే ముందుకు సాగిపోతాం’’ అంటున్నారు శ్రీనిధి శెట్టి. అందాల పాటీల్లో ‘మిస్‌ సుప్ర నేషనల్‌ ఇండియా’ కిరీటం దక్కించుకోవడం నుంచి, ‘మిస్‌ స్మైల్‌’… వరకు పలు టైటిల్స్‌ శ్రీనిధి సొంతం. తొలి చిత్రం ‘కేజీఎఫ్‌’తో హీరోయిన్‌గా విజయవంతంగా కెరీర్‌ మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఫుల్‌ బిజీ. ‘‘నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లో నాకు కొంతమంది తెలుగు ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారిని అడిగి తెలుగు పదాలు, వాక్యాలు ఓ లిస్ట్‌గా రాసుకుని, నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచే తెలుగు మాట్లాడటం అలవాటైంది. సినిమా సెట్స్‌లో తెలుగువాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, నేను కూడా వారితో తెలుగులోనే మాట్లాడతాను. అయితే తెలుగులో నేను ఇంకాస్త బెటర్‌ కావాలి. ఇకపై నా ప్రతి సినిమాకు నేనే డబ్బింగ్‌ చెబుతా” అంటోంది హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి.

Related posts