భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘హ్యాపీ రాజ్ ఈ నెల 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ప్రమోషనల్ మెటీరియల్‌కు మంచి ఆదరణ లభించింది. కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌తో తెలుగు ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్ గా – నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్ -స్మార్ట్ గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్న ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా అందరిదృష్టిని ఆకర్షించింది.ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్ , గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యాపీ రాజ్ రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు.

