‘శుభం’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రం ద్వారా స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ‘దీవాన’ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ‘దీవాన’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్ కలుగుతోంది. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్ ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి తరుపు వాళ్లతో ప్రమాదమని స్నేహితులు చెప్పినా వినిపించుకోడు. ఇంతే ప్రేమ అమ్మాయి నుంచి కూడా ఈ అబ్బాయికి దక్కిందా లేదా అనేది థియేటర్స్ చూడాలి. టీజర్ లోని ‘ప్రేమ ఇది ప్రేమ గుండెల్లోన సడిరేపేదే ప్రేమ…’ సాంగ్ బీజీఎం హార్ట్ టచింగ్ గా ఉంది. టీజర్ చివరలో ‘ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు, అది నీ పానం పీక్కతినకపోతే నన్ను అడుగురా..’ అనే డైలాగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ‘దీవాన’ లో ఒక ఇంటెన్స్ బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ చూడబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. టీజర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. టీజర్ పూర్తయ్యాక కూడా పాట ఇంకా మదిలోనే తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. విజువల్స్ చాలా రియలెస్టిక్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ జంట ఫ్రెష్ గా కనిపిస్తోంది. కొత్త హీరోయిన్ స్మేహ మణిమేగలై బ్యూటిఫుల్ గా కనిపించి ఆకట్టుకుంది.
‘దీవాన’ టీజర్ వచ్చేసింది..
