‘అఖండ-2’కు లైన్ క్లియర్ : 12న రిలీజ్.. 11న గ్రాండ్ ప్రీమియర్స్

Spread the love

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం అన్ని సమస్యలను పరిష్కరించుకుంది. ‘అఖండ 2’ విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్ .14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను సాధించడంతో అఖండ2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.   హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి, ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ అందించబోతుంది. ప్రేక్షకులు బాలకృష్ణను మూడు విభిన్న గెటప్‌లలో చూడబోతున్నారు, ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్, ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచుతుంది. సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా ‘అఖండ 2 తాండవం’ విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువయింది. నందమూరి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర డిసెంబర్ 5 చేసిన అలంకరణ, బ్యానర్లు, లైటింగ్ అంతా అలాగే ఉంచేశారు. వేరే సినిమాలు ఆడుతున్నా సరే డెకరేషన్ తీసేయొద్దని ఓనర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు. తక్కువ గ్యాప్ లో వస్తుందనే నమ్మకంతో అలా అన్నారు. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధుల మధ్య దీని గురించే చర్చ జరిగింది. విడుదల చివరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తనను బాధించిందంటూ నిర్మాత విశ్వ ప్రసాద్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. తాను నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై వచ్చిన రూమర్స్‌పైనా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ”విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది. థర్డ్‌ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై రూమర్స్‌ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం క్లియర్‌ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. ‘అఖండ 2’తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకర వరప్రసాద్‌ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్‌’, ‘పరాశక్తి’ తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఏదేమైనా ‘అఖండ-2’కు లైన్ క్లియర్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related posts