కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ.. తనే స్వయంగా ‘నేను నా లల్లి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎన్.ఎన్.ఆర్ చౌదరి. నేడు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 18). ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను వివరిస్తూ… ”మా సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నిర్మాణానంతర పనులన్నీ చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఎడిటింగ్ డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం డిఏకి ఎఫెక్ట్స్ కి.. అదేవిధంగా ఆర్ఆర్ కి ఇవ్వడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎంతో స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మా ‘నేను నా లల్లి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినిమా కూడా మేము అనుకున్న పద్ధతిలోనే చాలా బాగా వచ్చింది. మా యూనిట్ సభ్యులంతా సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా బాగా తెరకెక్కడానికి వారంతా ఎంతగానో శ్రమించారు. వారందరి శ్రమ వల్లే సినిమా ఆద్యంతం ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడం ఖాయం. ఆ బలమైన నమ్మకం మాకుంది. ప్రేక్షకులకు ఒక మంచి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉండేలా చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ.. నేనే స్వయంగా కథపై నమ్మకంతోనే ‘నేను నా లల్లి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కూడా నేనే రాయడం జరిగింది. థియేటర్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది. మా నమ్మకం నిజమని చిత్రాన్ని చూశాక మీరే మెచ్చుకుంటారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ చక్కటి పేరు వస్తుంది. అందరూ తమతమ పాత్రల్లో ఇమిడిపోయి ప్రతిభను కనబరిచారు” అని పేర్కొన్నారు. హీరోయిన్ తస్లీమ్ మాట్లాడుతూ .. సినిమాలో నటిస్తున్నప్పుడు ఎంతగానో ఆనందపడ్డాను. నా పాత్ర ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఒక ఫ్యామిలీలో ఉండే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా అందర్నీ సినిమా ఆలోచనలో పడేస్తుంది. ఎంత చక్కటి సినిమా చూశామన్న అనుభూతి ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. మా దర్శకుడు, నిర్మాత, హీరో అయిన ఎన్.ఎన్.ఆర్ చౌదరి గారు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అందంగా.. అందరూ మెచ్చేలా తెరకెక్కించారు. వారి శ్రమ తెరపై చూడాల్సిందే” అని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పద్మ జయంతి, హేమ సుందర్, పద్మా రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్. రాజా, మాటలు: మెండెం శ్రీధర్, డీఓపీ : శ్రీనివాసచారి , మేకప్: సాంబశివరావు, డాన్స్: మాస్టర్ కపిల్, ఆర్ట్ డైరెక్టర్ : నాని పండు, ఫైట్ : మాస్టర్ తుఫాన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ : డ్రీమ్ స్టూడియో , బ్యానర్ : పవన్ తేజ ఫిలిం, కథ-స్క్రీన్ ప్లే-పాటలు-దర్శకత్వం-నిర్మాత : ఎన్.ఎన్.ఆర్ చౌదరి.
కుటుంబ అనుబంధాలతో ‘నేను నా లల్లి’
