మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ఏస్’ తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్న శ్రీ పద్మిణి సినిమాస్

Sri Padmini Cinemas acquires Telugu rights of Vijay Sethupathi's Makkal Selvan 'Ace'
Spread the love

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలపై ఆడియెన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. విజయ్ సేతుపతి నుంచి సినిమా వస్తుందంటే అందులో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అంతా ఫిక్స్ అవుతారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా అరుముగ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్’. ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అరుముగ కుమార్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది.
శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ సేతుపతి ‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా కూడా మంచి రేటుకి శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ చేజిక్కించుకుంది. బి. శివ ప్రసాద్ దర్శక, నిర్మాణంలో ఇది వరకు ‘రా రాజా’ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే.
విజయ్ సేతుపతి ‘ఏస్’ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందించగా.. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.

Related posts

Leave a Comment