సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన W/O అనిర్వేష్

W/O Anirvesh completes censor formalities and is ready for release
Spread the love

గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన W/O అనిర్వేష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు ప్రతిభను ప్రశంసించారు. దర్శకుడు గంగ సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు సీనియర్ రైటర్ బాబీ కెఎస్ఆర్. విభిన్న పాత్రలలో ప్రేక్షకులకు దగ్గరవుతున్న జబర్దస్త్ రాంప్రసాద్ హీరోగా ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగా ప్రేక్షకులకు చూపించబోతున్నటువంటి ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తుంది.
సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. వి ఆర్ కె నాయుడు కెమెరామెన్ గా తన ప్రతిభను చూపించారు. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

Related posts

Leave a Comment