పి.వి నర్సింహారావు గొప్ప దార్శనికుడు ‘భారతరత్నఇవ్వాలి’

ex primeminister p v narashimharao
Spread the love

శతజయంతి ఉత్సవాల్లో ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్

  • (టాలీవుడ్ టైమ్స్ – హైదరాబాద్ బ్యూరో)
  • దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు సోమవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్‌లో ఉన్న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నెక్లెస్‌రోడ్‌లోని 26 అడుగుల పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్‌, సీఎంలు పీవీ విగ్రహానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌ పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన ఉత్సవాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, ఉప్పల్ నియోజకవర్గ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలిసిన ”టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి”తో ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ -” పి వి గారు తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి అని , పి వి సార్వభౌమ ఆలోచన తో దేశ ఆర్థిక, సామాజిక, భద్రత అంశాలు, రైతుల పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. దేశాన్ని, సమాజాన్నీ ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి పి.వి నర్సింహారావు అని పీ.వీ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన ఆలోచన, విధానాలను మరింత బలంగా మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారు అని అన్నారు. భూ సంస్కరణలలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా నమోదు చేస్తున్న భూ రికార్డులు అమలు చేయడానికి అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు రావడానికి, లక్షలాది ఉద్యోగాలు ఏర్పడడానికి సీఎం కేసీఆర్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చారు. ఐపాస్ ద్వారా పరిశ్రమలకు ఏకీకృత విధానం లో అనుమతులు ఇవ్వడం. ఉత్సవాలు, వేడుకలే కాకుండా పి.వి నరసింహా రావు ఆలోచనలను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభత్వం అని అన్నారు. రానున్న తరాలకు పి వి ఖ్యాతిని చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరమని అన్నారు. పి.వి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అని తెలిపారు. పి.వి నర్సింహారావు గొప్ప దార్శనికుడు. పి.వి నర్సింహారావు (100) శత జయంతి వేడుకలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పి.వి అని అన్నారు. తెలంగాణలో కూడా పెద్దఎత్తున భూ సంస్కరణలు తేవడం జరిగింది.పి.వి నరసింహా రావుకు దేశంలో సరైన గుర్తింపు లభించలేదు. ప్రపంచ వ్యాప్తంగా పి.వి నరసింహా రావు కు గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు.పి.వికి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. పి వి గారు తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్రం లో కాకుండా దేశ అభివృద్ధి కి ఉపయోగపడ్డాయి అని బొట్ల పరమేశ్వర్ అన్నారు.

Related posts

Leave a Comment