నాని హీరోగా కెరీర్ లో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటించిన సినిమా ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ‘దసరా’ తో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ తన సెకండ్ సినిమా కూడా దసరా టైపులోనే చేస్తాడని చెబుతున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న శ్రీకాంత్ హీరోని ఎంపిక చేయాల్సి ఉందట. ‘దసరా’తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ తో చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ తదుపరి సినిమాలో మెగా హీరో నటిస్తాడని టాక్. అఫీషియల్ గా ఈ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. హిట్ పడిన తర్వాత కూడా వెయిట్ చేస్తున్న డైరెక్టర్ శ్రీకాంత్ టైం తీసుకున్నా సరే మరో మంచి ప్రాజెక్ట్ తో రావాలని చూస్తున్నాడు. ఇంతకీ శ్రీకాంత్ సినిమాలో హీరో ఎవరు.. ఈసారి ‘దసరా’ డైరెక్టర్ ఎలాంటి కథతో రాబోతున్నాడు అన్నది త్వరలో తెలుస్తుంది. నాని లాంటి క్లాస్ హీరోతో మాస్ సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల కొద్దిపాటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా పడితే మాత్రం నెక్ట్స్ లెవెల్ రిజల్ట్ అందుకునే ఛాన్స్ ఉంది.
Related posts
-
‘రంగంస్థలం’ తరవాత అంతటి సినిమా : ‘పొట్టేల్’ పై దర్శకుడు సందీప్ వంగా
Spread the love ‘రంగంస్థలం’ చిత్రం తరవాత అంత మంచి కథతో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’ అని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి... -
The next movie after ‘Rangamsthalam’: Director Sandeep Vanga on ‘Pottel’
Spread the love Famous director Sandeep Reddy Vanga said that ‘Pottel’ is the next film with such... -
Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath
Spread the love The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content,...