అచ్చ తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ…
రూప కొడువాయూర్ …పేరు ఏదో మలయాళీ అమ్మాయిలా ఉన్నా.. అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపించే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ సొంతఊరు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. తన మొదటి సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయినప్పటికీ కేవలం తన నటనాప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అలాగే వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తోంది! రూప కొడువాయూర్ ప్రస్తుతం లండన్ లో ఎం.డి (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) చేయడానికి ప్లాబ్ 2 పరీక్షకు సన్నద్దమవుతోంది. బేసిగ్గా తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సునాయాసంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అయింది. అందుకే స్క్రీన్ లో తాను ఎంతసేపూ ఉన్నా.. అలా చూస్తూ ఉండి పోతాము. ఎంత మంది ఉన్నా.. రూప ప్రత్యేకంగా కనిపిస్తుంది. మంచి అవకాశాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రూప కొడవయూర్ లీడ్ రోల్ లో నటించిన ఒక యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ డిసెంబర్లో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదలకు ముస్తాబు అవుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రిలో పేరు మోసిన బడా పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం. తెలుగు అమ్మాయిలను పరిశ్రమకు ఆహ్వానించే దర్శక నిర్మాతలకు రూప కొడువాయూర్ ఒక కళాఘని అని చెప్పవచ్చు. సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుందనడంలో ఆశ్చర్యం లేదు. మరి మంచి పాత్రలతో రూప అలరించాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం..!!