ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Independence Day celebrations at Filmnagar Cultural Center
Spread the love

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు జెండాను ఎగురవేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందీప్ ప్రకాష్ ఐ.ఆర్.ఎస్. చీఫ్ కమిషనర్, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో మొదటగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఫౌండర్ మెంబర్స్ ను స్మరించుకున్నారు. ముఖ్య అతిధి సందీప్ ప్రకాష్ , ఫౌండర్ కమిటీ మెంబర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, డా. కె.ఎల్. నారాయణ, పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడారు. అనంతరం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దత్తత తీసుకున్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు పీ సత్యానందం, సినీ రచయితా తండ్రి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్కాలర్ షిప్ అందచేశారు. ఆ తర్వాత ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ స్టాఫ్ పిల్లలలో ఉన్న మెరిట్ విద్యార్థులకు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ మెంబర్లు జగదీష్, రామరాజు టాబ్ లను స్పాన్సర్ చేశారు. తదనంతరం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ లేట్ డీవీఎస్ రాజు గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎస్ రాజు గారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ వీవీఎస్ఎస్ పెద్దిరాజు, కమిటీ మెంబర్స్ గా కాజా సూర్యనారాయణ, బాలరాజు, గోపాలరావు, వడ్లపట్ల మోహన్, సి.హెచ్.వరప్రసాదరావు, శైలజ జూజాల, కల్చర్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ, వైస్ చైర్మన్ సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు.

Related posts

Leave a Comment