వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా మిడతనపల్లి విజయ్

Spread the love

బుధవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల ఆధ్యర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు మిడతనపల్లి విజయ్, త్వరలో షర్మిల ఆధ్యర్యంలో ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హైదరబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా వైఎస్ షర్మిల నియమించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నన్ను హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా నియమించిన షర్మిలమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 8న మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున పార్టీ ఆవిర్భావించాల‌ని షర్మిలమ్మ నిర్ణయించార అని, అన్ని వ‌ర్గాల‌ బాగు కోసం స్థాపించ‌బోయే పార్టీకి సంబంధించి జెండా, అజెండా రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని భావించాము అని ఇందుకోసం రాష్ట్రంలోని పేద‌లు, యువ‌త‌, విద్యావంతులు, మేధావులు, లాయ‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు, అనుభ‌వ‌జ్ఞులు, రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అమూల్య‌మైన స‌ల‌హాలు అందించాల‌ని ఈ సందర్భంగా కోరారు.

Related posts

Leave a Comment