25న ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ జనరల్ బాడీ సమావేశం

fca general badi meeting on 25 july
Spread the love

స‌మావేశం: జూలై 25, ఆదివారం, ఉద‌యం 10గంట‌ల‌కు

వేదిక: ప్రెస్‌క్ల‌బ్‌, సోమాజిగూడ‌

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు న‌మ‌స్కారం…
జూన్ 30న జ‌రిగిన కార్య‌వ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం, జూలై 25వ తేదీ ఆదివారం ఉద‌యం 10గంట‌ల‌కు జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జరగనుంది. అదే రోజు ఎన్నిక‌లు కూడా జరగబోతున్నాయి. మెంబ‌ర్ షిప్ రెన్యువ‌ల్ కూడా ప్రతి మెంబరు తప్పనిసరిగా చేయించుకోవాలి.
అజెండా:

  1. జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం, ఎన్నిక‌లు, మెంబ‌ర్‌షిప్ రెన్యువ‌ల్‌
  2. స‌భ్యులు 2019-2021 సంవ‌త్స‌రానికిగాను రెన్యువ‌ల్ 200+200= 400 చెల్లించాలి.
  3. ఈ రెండు సంవ‌త్స‌రాలు కంటే అంత‌కుముందు బ‌కాయిలు ఉన్న‌వారు 1000 (వెయ్యిరూపాయ‌లు) చెల్లించాలి.
  4. ఏ ఒక్కరు మిస్ కాకుండా అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాలి.
  5. వ‌చ్చేట‌ప్పుడు ఒక పాస్‌ఫొటో తీసుకురాగ‌ల‌రు. అది ఐడీ కార్డ్ కోసం. మ‌న‌కు ఏ అవ‌స‌రం వున్నా అన్నిచోట్ల అసోసియేష‌న్ ఐడీ కార్డు అడుగుతున్నారు. కాబట్టి ఇది గ‌మ‌నించాలి.
  6. ఇక జూన్ 30న జ‌రిగిన స‌మావేశంలో కార్య‌వ‌ర్గం ఎన్నిక‌ల రిట‌ర్‌నింగ్ అధికారిగా సీనియ‌ర్ స‌భ్యులు కె. ల‌క్ష్మ‌ణ్‌రావుగారిని, మ‌న స‌భ్యుడు పి. హేమ‌సుంద‌ర్‌గారిని ఎంపిక చేసింది.
  7. ఉద‌యం 10 గంట‌ల‌నుంచి 11.30గంట‌ల వ‌ర‌కు మెంబ‌ర్ షిప్ రెన్యువ‌ల్ చేసి ర‌సీదు తీసుకోవాలి.
  8. 11.30 నుంచి కార్య‌ద‌ర్శి నివేదిక‌. ఆ త‌ర్వాత అకౌంట్స్ స‌బ్‌మిట్ చేయాలి. అనంత‌రం వాటిపై చ‌ర్చ‌.
  9. ఒంటిగంట‌కు స‌భ్యుల రెన్యువ‌ల్స్‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేయాలి. రెన్యువ‌ల్ అయిన వారు మాత్ర‌మే ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కు వుంటుంది.
  10. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ ఏర్పాటు ఉంటుంది.
    11.2 గంట‌ల నుంచి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. క‌నుక అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని విన‌తి.

ఇట్లు..
సురేష్‌కొండేటి (అధ్య‌క్షుడు)
ఇ. జనార్ద‌న్‌రెడ్డి (ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి)
మరియు కార్య‌వ‌ర్గం

Related posts

Leave a Comment