అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ చాలా అద్భుతం. నా గత చిత్రాలకు ఎంతో ప్రేమను అందించారు. ‘హృదయం మురళి’ స్పెషల్ సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాను…
Month: July 2026
ఘనంగా మహేష్ కాంపెల్లి ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ విడుదల
మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. “ది పాయింట్ ఆఫ్ వ్యూ” అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా… నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. “మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో…
జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 10న మెగా జాబ్ మేళా–2026
తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీటీపీఓఏ), జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 10 న ఉస్మానియా యూనివర్సిటీలోని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెగా జాబ్ మేళా–2026” నిర్వహించనుంది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా జాబ్ మేళా కు సంబంధించిన గోడ పత్రికను డా. ఎంజీ రామచంద్రన్, జీవీకే, అజయ్ కుమార్, ఎం.రాజు లతో కలసి టీటీపీఓఏ అధ్యక్షుడు డా. జయరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నియామక ప్రక్రియలో ప్రముఖ బహుళజాతి సంస్థలతో సహా 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ లేదా…
మలయాళీ కవి కె. సచ్చిదానందన్ కు సినారె ‘విశ్వంభర’ జాతీయ పురస్కారం
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి స్మృత్యర్థం శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ప్రదానం చేసే విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ మలయాళీ కవి కె. సచ్చిదానందన్ ను ఎంపిక చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్ సి.నారాయణరెడ్డి 95వ జయంత్యుత్సవంలో సచ్చిదానందన్ ను 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక,ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు ట్రస్టు అధ్యక్షులు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక మలయాళ కవులలో అగ్రశ్రేణికి చెందిన సచ్చిదానందన్ కవిగా, సాహిత్య విమర్శకునిగా, నాటక కర్తగా, సంపాదకునిగా, కాలమిస్టుగా, అనువాదకునిగా ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బహుముఖీన సేవలు అందించారు. ఆయన కవితలు మలయాళం ఇతర భారతీయ భాషల్లో 18 సంపుటాలుగా వెలువడ్డాయి.…
నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్ యజమాని మరియు నటుడు రాజారెడ్డి, తో పాటు శ్రీనివాస్‌రెడ్డిలు…
భాగ్యశ్రీ బోర్సే: సెన్సిటివ్ గర్ల్!
జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇలా పంచుకుంది… ”నేను చాలా సెన్సిటివ్. చిన్న విషయానికే వెంటనే ఎమోషనల్ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్ పవర్. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను. ప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్…
రావు బహదూర్ : బెస్ట్ ఓపెనింగ్స్!
మ్యాప్ మిరాకిల్స్ సత్యదేవ్ హీరోగా దీపా థామస్ హీరోయిన్ గా దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన అవైటెడ్ తెలుగు సినిమానే ‘రావు బహదూర్’. ఒక ఇంట్రెస్టింగ్ ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి వచ్చి ఒకింత మిక్స్డ్ టాక్ సంతరించుకుంది. అయినప్పటికీ డే 1 మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి రోజు రావు బహదూర్ ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు పిఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది మాత్రం సత్యదేవ్ కి అలాగే వెంకటేష్ మహాకి కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సినిమా పరిస్థితి స్టడీగానే ఉంది సో ఈ వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం…
‘Amba’s Revenge’ Set to Become Telugu Cinema’s First Full-Length AI Feature Film
▪️ First full-length AI-powered feature film in the Telugu film industry ▪️ Promotional campaign begins ahead of release Hyderabad: Marking a significant technological milestone in Telugu cinema, Amba’s Revenge is gearing up for release as the industry’s first full-length feature film created with the support of Artificial Intelligence (AI). Produced by Yogendra Potluri and Rani Madison under the Nakka Thoka Films banner, the film is directed by Jayavardhan Madi. The AI Visual Design & Development is being handled by Kalai Visual Studios. With its title poster officially unveiled, the makers…
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ
ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా చాటింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత వాలీబాల్ జట్టు మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇది దేశంలో వాలీబాల్ ఆటకు మరింత ఆదరణ తీసుకురానుంది. భారత వాలీబాల్ జట్టు ఈ అద్భుత విజయం సాధించడం వెనక పలు నగరాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ఫ్రాంఛైజీలు, ఆ ఫ్రాంఛైజీలతో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాంటి ఫ్రాంఛైజీలలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కూడా కీలక జట్టుగా పోటీ పడుతోంది. హైదరాబాద్…
