మధ్యతరగతి కుటుంబ కథే ‘కార్మేని సెల్వం’ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే చిత్రం ‘కార్మేని సెల్వం’ పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుత…
Day: March 26, 2026
అతడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే..
‘అబ్బే మా మధ్య డేటింగ్, గీటింగ్స్ ఏమీ లేవు.. అతడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అంటూ తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాములుగా గాసిప్స్ వస్తున్నాయంటే ఎవరైనా సరే కాస్త జాగ్రత్త పడతారు కానీ.. ధనుష్-మృణాల్ జోడీ మాత్రం హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మృణాల్, ధనుష్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే మళ్లీ తమవైపు అటెన్షన్ గ్రాబ్ అయ్యేలా చేస్తున్నారు. ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త ఇప్పటిదీ కాదు. ఇద్దరు కలిసి పార్టీల్లో సందడి చేయడం, సన్నాఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్‌కు ధనుష్ రావడం, ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడంతో డేటింగ్ రూమర్లకు రెక్కలొచ్చాయి. తేరీ ఇష్క్ మే రిలీజ్ టైంలోనూ ఇలాంటి కథలొచ్చాయి.…
ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా
నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రం సుయోధన : సాయి కుమార్ ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – నేను ఈ సినిమాలోకి రావడానికి…
‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ… రొమాంటిక్ డ్రామా!
‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ గురువారం థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం… కథ: చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న బావా మరదళ్లు యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి). రాజి చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్ డ్రాపౌట్. రాజి పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే.. అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేగాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి, రాజి ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. విశ్లేషణ: ‘బ్యాండ్ మేళం’లో మేజర్ డ్రా బ్యాక్ కథ. పాతచింతకాయ పచ్చడిలా సాగే ఈ తరహా కథలు టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో…
బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ..
పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ లపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బర్బరీకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బర్బరీకుడు చిత్రం ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథతో ఈ చిత్రం తెరక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అలాగే పాటల రచయితగా పనిచేసిన శివఝాన్సిరేగాల ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు భారతీయ అతిపెద్ద ఇతిహాసం మహాభారతంలోని ఒక యోధుడి కథను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయంలో దర్శకుడు తో పాటు నిర్మాతల అభిరుచిని కూడా…
