వారసత్వంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం కత్తి మీద సామే. తల్లి అమృతాసింగ్ గంభీరం.. తండ్రి సైఫ్ అలీఖాన్ వాక్చాతుర్యం పుణికిపుచ్చుకున్న సారా అలీఖాన్.. నేటి తరం కథానాయికలలో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు, ఆమె ఇంటర్వ్యూలను గమనిస్తే సారా ఒక గ్లామర్ డాల్ మాత్రమే కాదని, గట్టి పట్టుదల ఉన్న నటి అని అర్థమవుతుంది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో సారా అలీఖాన్ పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఆమె సినిమా మాత్రం కాదు, ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలు. కేదార్‌నాథ్ ఆలయానికి ఆమె తరచుగా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఆలయ కమిటీలు హిందూయేతరుల దర్శనంపై కొన్ని నిబంధనలు విధుస్తున్నట్టు…
