చిన్న నిర్మాతలే పరిశ్రమకు పెద్ద దిక్కు : ‘మీట్‌ ది ప్రెస్‌’లో చదలవాడ శ్రీనివాసరావు

Small producers are the big direction for the industry: Chadalawada Srinivasa Rao on 'Meet the Press'

* తెలుగు రాష్ట్రాల సీఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి * ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజి గూడ ప్రెస్‌ క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద ఈ కార్యక్రమం జరిగింది. అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎంతో మంది సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో ‘మీట్‌ ది ప్రెస్‌’ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు’ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా ఆయనకు శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది.…