పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా – శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఉగాది కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మంచి బజ్ ని పెంచింది. ఇక ఈ ట్రైలర్ పై మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా ట్రైలర్ పై తమా స్పందన తెలియజేయడం వైరల్ గా మారింది. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్”…
Day: March 15, 2026
ప్రియదర్శి, సాయి కుమార్ ‘సుయోధన” టీజర్ విడుదల
ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ…
