‘ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా..’ అంటోంది బ్యూటీ సంయుక్త మీనన్. టాలీవుడ్ లో చాలామంది కథానాయికలకు స్టార్‌డమ్‌ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే తపన ఉండదు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్.. తదితర తారలు మాత్రం చక్కగా తెలుగు నేర్చుకొని, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ, ఆదరించిన భాషపై అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తగా సంయుక్త మీనన్ కూడా చేరింది. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె తెలుగులో మాట్లాడినతీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘తొలిరోజుల్లో నాకు అసలు తెలుగు రాదు.‘విరూపాక్ష’ చేస్తున్న టైమ్‌లో తెలుగు నేర్చుకోవాలని ఫిక్సయ్యాను. నేర్పేందుకు ట్యూటర్లను పెట్టుకున్నాను. వారివల్లే ఇంత త్వరగా మాట్లాడగలుగుతున్నా. ప్రస్తుతం తెలుగు నా మాతృభాషలాగే మారిపోయింది. ఇకపై…
