సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ …రొటీన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్!

హీరో శివాజీ – లయ కాంబినేషన్ మన టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకటిగా బాగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మొదట ఓటిటికి ప్లాన్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం (మార్చి 6, 2026) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం… కథ: శ్రీరామ్ అన్నమయ్య జిల్లా కొత్తపేటలో పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు. అతడు నీతి, నిజాయితీకి మారుపేరు. లంచాలు, అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. అయితే భార్య ఉత్తర (లయ) మాత్రం అక్రమ సంపాదన కోసం భర్త శ్రీరామ్‌ను వేధిస్తుంటుంది. కొడుకు మిట్టు (రోషన్) తుంటరి పనులు చేస్తూ హింసకు పాల్పడుతుంటాడు. భార్య, కొడుకులతో వేగలేకపోతున్న సమయంలో విక్రమ్…

‘వారాణసి’ కోసం..పాన్ వరల్డ్ లెవెల్లో హైప్!

Hype at the pan-world level for 'Varanasi'!

* గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం ప్రియాంక చోప్రా ప్రమోట్ పాన్ వరల్డ్ లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న భారీ చిత్రాల్లో ఒకటే ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్ ప్రియాంక చోప్రా కలయికలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రాన్ని మాత్రం వరల్డ్ సినిమా దగ్గర ప్రియాంక చోప్రా ప్రమోట్ చేస్తున్నంత రీతిలో ఎవరూ చేయడం లేదనే చెప్పొచ్చు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రాకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అక్కడి మీడియా దగ్గర వీలు దొరికినప్పుడు ఈ సినిమా చర్చని తప్పకుండా తీసుకొస్తుంది. ఇలా అనేక హాలీవుడ్ ఇంటర్వ్యూస్ లో ఆమె ‘వారణాసి’ ప్రస్తావన తీసుకువస్తుండడం ఈ సినిమాకి…

భూమి పెడ్నేకర్ : పవర్‌ఫుల్ పాత్రలవైపే మొగ్గు!

Bhumi Pednekar: I prefer powerful roles!

బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎంచుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వి ది విమెన్’, ‘విమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు కమర్షియల్ సక్సెస్ కోసం, అంటే రూ. 200 కోట్ల బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలనే ఆత్రుతతో కొన్ని పాత్రలు అంగీకరించానని ఆమె ఒప్పుకున్నారు.. ‘నేను కొన్ని తప్పులు చేశాను. ఆ పాత్రలను నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) అగౌరవపరిచేలా ఉండే పాత్రలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నాకు గౌరవం లేని చోట నేను ఉండను’ అని భూమి కుండబద్దలు కొట్టారు. ప్రజంట్ భూమి మాటలు వైరల్…

పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి..సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

Vijay makes a splash with Trisha at the wedding..videos go viral on social media

హీరో విజయ్-త్రిష చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత ఈ జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. ఓ నటితో విజయ్ ఉంటున్నాడని బీజేపీ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు. అంతలోనే విజయ్ భార్య సంగీత కూడా బాంబ్ పేల్చింది. తన భర్త ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 2025 డిసెంబర్‌లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. భార్య…

జాన్వీ అందానికి అభిమానులు ఫిదా ..

Fans are in awe of Janhvi's beauty..

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా వెండితెర ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్ తన కూతురిని స్టార్ హీరోయిన్ గా చూడడం కోసం శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. కానీ, అది నెరవేరకుండానే ఆమె మరణించారు. అయినా కూడా తల్లి పేరును నిలబెట్టడానికి జాన్వీ తన వంతు కృషి చేస్తున్నారు. ‘దేవర’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కూడా తంగం పాత్రలో జాన్వీ తెలుగు అభిమానులను ఫిదా చేశారు. ఇక ‘దేవర’ తరువాత జాన్వీ నటిస్తోన్న చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి…

గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

Virosh couple creates global record

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం. విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను ఈ అరుదైన రికార్డ్ చూపిస్తోంది. ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.…

‘పెద్ది’నుంచి జాన్వీ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌

Janhvi's birthday special poster from 'Peddhi'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పోస్టర్‌లో మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా ధరించి ఆమె స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మెడలో లేయర్డ్ నెక్లెస్‌లు, చేతికి బ్రేస్‌లెట్, ఎరుపు రంగు రౌండ్ సన్‌గ్లాసెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను…