సారా అలీఖాన్ : విలక్షణమైన వ్యక్తిత్వం

Sara Ali Khan: A unique personality

వారసత్వంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం కత్తి మీద సామే. తల్లి అమృతాసింగ్‌ గంభీరం.. తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ వాక్చాతుర్యం పుణికిపుచ్చుకున్న సారా అలీఖాన్‌.. నేటి తరం కథానాయికలలో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు, ఆమె ఇంటర్వ్యూలను గమనిస్తే సారా ఒక గ్లామర్‌ డాల్‌ మాత్రమే కాదని, గట్టి పట్టుదల ఉన్న నటి అని అర్థమవుతుంది. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో సారా అలీఖాన్‌ పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఆమె సినిమా మాత్రం కాదు, ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలు. కేదార్‌నాథ్‌ ఆలయానికి ఆమె తరచుగా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఆలయ కమిటీలు హిందూయేతరుల దర్శనంపై కొన్ని నిబంధనలు విధుస్తున్నట్టు…

మిల్కీ బ్యూటీ తమన్నా : సౌత్ కు స్వస్తి చెప్పినట్టేనా?

Milky beauty Tamannaah: Is she quitting South?

మిల్కీ బ్యూటీ తమన్నా 2026లో తన ఫోకస్‌ను పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్లించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దశాబ్ద కాలం పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో ఓరోమియో, సిద్ధార్థ్ మల్హోత్రాతో వాన్, అజయ్ దేవగన్-సంజయ్ దత్ కలయికలో వస్తున్న రేంజర్ వంటి భారీ హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆమె డైరీ మొత్తం బాలీవుడ్ సినిమాలతోనే నిండిపోవడంతో, 2026ని ఆమె తన ‘హిందీ ఇయర్’గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ​దక్షిణాది సినిమాలకు తమన్నా గ్యాప్ ఇవ్వడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆమె చేసిన చివరి చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడం ఒక కారణమైతే, బాలీవుడ్ మేకర్స్ ఆమెకు వైవిధ్యమైన పాత్రలు మరియు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం మరో ప్రధాన కారణం. కేవలం వెండితెరపైనే కాకుండా, హిందీ…

అనుష్కశర్మ : పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్!

Anushka Sharma: Powerful comeback!

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం రోజురోజుకూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ సినిమా కాస్టింగ్ గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకోన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అనుష్క శర్మ చేరికతో ఈ సినిమాలోని ఐదవ కథానాయికగా ఆమె నిలవనుంది. చాలా ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్కకు ఇది ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ​అయితే, ఇంతమంది స్టార్ హీరోయిన్లను ఒకే సినిమాలో నటింపజేయడంపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఉత్తరాది మార్కెట్‌ను ఆకర్షించడానికే బాలీవుడ్ భామలను…

ఆ లక్కీ బ్యూటీస్ ఎవరో..?

Who are those lucky beauties?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు, ఈ చిత్రాన్ని వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రాబోయే ఒక స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా సినిమాల్లో ప్రత్యేక గీతం అంటే కేవలం ఒకరు లేదా ఇద్దరు కథానాయికలు మాత్రమే కనిపిస్తుంటారు. అయితే బుచ్చిబాబు ఈ విషయంలో చాలా వైవిధ్యంగా ఆలోచిస్తున్నారట. ఈ పాటలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు క్రేజీ…

‘ది ట్రైటర్స్’ హోస్ట్ గా…

As the host of 'The Traitors'...

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ ‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వరుస సినిమాలతో సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జ, ఇప్పుడు సినిమాలతో పాటు కొత్త ఫార్మాట్స్ వైపు కూడా దృష్టి పెట్టుతున్నారు. ‘ది ట్రైటర్స్ తెలుగు’ ద్వారా ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వబోతున్నారు. ఈ రియాలిటీ షో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక కాన్సెప్ట్‌తో పెద్ద హిట్ అయ్యింది. అదే థ్రిల్, టెన్షన్ తెలుగు వెర్షన్‌లో కూడా ఉండబోతోంది. ఈ షోలో తేజ సజ్జ ఒక కొత్త అవతార్ లో కనిపించబోతున్నారు. హోస్ట్‌గా ఆయన…

‘రాకాస’ స్నేక్ డ్యాన్స్..

'Rakasa' snake dance..

నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్…

‘లవ్‌వాలా’ ప్రారంభం

'Lovewala' launch

రవీంద్ర తేజ్ హీరోగా ఎస్.వి.ఏ.ఎన్ ఎంటర్‌టైన్‌మెంట్.. శుభకరి ఇన్‌ఫ్రా మీడియా బ్యానర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్‌వాలా’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, బుచ్చిబాబు సానా మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేశారు. పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో రాజ్ అర్జున్, మణి చందన, కమల్,…

I wish the movie ‘Pithapuramlo Ala Modalaindi’ to become a hit in our ‘Preyasirave’ range.. Hero Srikanth at the trailer launch event

I wish the movie ‘Pithapuramlo Ala Modalaindi’ to become a hit in our ‘Preyasirave’ range.. Hero Srikanth at the trailer launch event

The movie ‘Pithapuramlo’ is directed by renowned director Mahesh Chandra and stars Dr. Rajendra Prasad, Pathviraj, Kedar Shankar, Mani Chandana, Annapurnamma, Sunny Akhil, Virat, Sai Praneeth, Srilu, Pratyusha, and Rehana in the lead roles. The subtitle of this movie is ‘Ala Modalaindi’. The movie was produced by Dundigalla Balakrishna, Akula Suresh Patel, and F.M. Murali (Godavari Kittayya) under the banner of Mahesh Chandra Cinema Team. The content released about this movie till now has captivated the audience. The trailer of this movie was released on Friday. The trailer launch event…

‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలి : హీరో శ్రీకాంత్

The movie 'It Started in Pithapuram' should be a hit in our 'Preyasirave' range: Hero Srikanth

డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’.  మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఇక తాజాగా శుక్రవారం నాడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా…

రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని కోరుతున్న నిర్వాహకులు..

Rockstar Anirudh XV Tour – Organizers are asking people to plan ahead for the live concert to be held in Hyderabad on Saturday.

* పార్కింగ్, ఎంట్రీ & ఇతర వివరాలు తెలుసుకోండి హైదరాబాద్, మార్చి 20, 2026: గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం నాడు జరగబోయే రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు Anirudh Ravichander తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను Brand Avatar నిర్వహిస్తుండగా, TribeVibe Entertainment (BookMyShow సంస్థ) సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్ మరియు షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వివరాలు గేట్లు తెరవబడే సమయం: సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే స్టేజ్ ప్రారంభం: సాయంత్రం 6:00…