మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని ప్రాంతాలలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. 6వ రోజు ముగిసే నాటికి, ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇప్పుడు రూ. 300 కోట్ల మార్కు చేరువలో ఉంది. ముఖ్యంగా “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం యూఎస్ఏ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. గతంలో చిరంజీవి అత్యుత్తమ ఓవర్సీస్ చిత్రంగా నిలిచిన ‘సైరా నరసింహారెడ్డి’ (2.7 మిలియన్లు) రికార్డ్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అధిగమించింది. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్…
Month: January 2026
అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ విడుదల
నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ సన్నిహిత మాటలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన జయంత్ చల్లా గారికి, అలాగే నాగేశ్వర్ రావు పూజారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ…
నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ : ఫన్ తో సాగే ఫామిలీ డ్రామా!
ఈ సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలయిన చిత్రాల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. యువతరం కథానాయకుడు శర్వానంద్ విజయాన్ని చవిచూసి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, నిర్మాతల ప్లానింగ్‌తో ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం.. కథ: ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్), అదే కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో…
manashankaravaraprasadgaru movie review in telugu : పసందైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ !
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘మన శంకరవరప్రసాద్ గారు’గా సంక్రాంతికి బరిలోకి దిగారు. తన సినిమాలతో అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు తెలియడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అంచనాలు కామన్. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేష్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే హోప్స్
హీరోయిన్ శ్రీలీలది ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్. ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ భామ కెరీర్ ప్రస్తుతం సందిగ్ధంలోనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా ‘భగవంత్ కేసరి’లో కీలకపాత్ర పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా… ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని వెక్కిరించాయి. గత రెండేళ్ళలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొంది. కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’లో నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సొగసరి ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో శ్రీలీల మెరవనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. దీంతో…
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ : నాన్ స్టాప్ నవ్వుల పండుగ!
(చిత్రం: అనగనగా ఒక రాజు విడుదల తేదీ : జనవరి 14, 2025, రేటింగ్ : 2.5/5, నటీనటులు : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్, భద్రం తదితరులు. దర్శకత్వం : మారి, నిర్మాతలు : నాగవంశీ, సాయిసౌజన్య, సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : జె. యువరాజ్, కూర్పు : కళ్యాణ్ శంకర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సమర్పణ: శ్రీకర స్టూడియోస్). ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్…
మెగాస్టార్ ఇంట్లో ఘనంగా విజయోత్సవ వేడుక
* హాజరైన వెంకటేష్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు…
అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్
సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా రాబోతుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను పవర్‌ఫుల్ వీడియో కంటెంట్‌తో అనౌన్స్ చేయటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బివి వర్క్స్‌తో కలిసి నిర్మిస్తోన్నఈ సినిమా నేషనల్ రేంజ్‌లో అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. బన్నీవాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ అనౌన్స్‌మెంట్ తెగ వైరల్ అవుతోంది.…
కెరీర్ అంటే నాకు ప్యాషన్ : హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ…
టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజా సాబ్’ సక్సెస్ హ్యాపీనెస్ ను ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే… – ‘రాజా సాబ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాను.…
‘అనగనగా ఒక రాజు’ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి
ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ…
