సూర్యతో నటించడం గర్వంగా ఉంది : పూజా హెగ్డె

Proud to act with Suriya : Pooja Hegde

హీరో సూర్య నటించే 69వ చిత్రంలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే అన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెట్రో’ మూవీ చిత్రీకరణ పూర్తి చేసి మే ఒకటో తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో తనకు దక్కిన అవకాశంపై పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలన్నీ నన్ను గర్వపడేలా చేశాయి. కానీ, ‘రెట్రో’ మాత్రం నేను గర్వించే చిత్రంగా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం నాకు చాలా ఇష్టం. షూటింగు సమయంలో పొందిన అనుభూతి ఎన్నటికీ మరిచిపోలేనిది. సినిమా ఇంకా చూడకుండానే గట్టి నమ్మకంతో చెబుతున్నాను. ప్రస్తుతం ‘రెట్రో’ మూవీ ఎడిటింగ్‌ జరుగతోంది. త్వరలోనే మేకర్స్‌ ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ తేదీలు వెల్లడిస్తారు’ అని వివరించారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ తో ‘జన నాయగన్‌’,…

విజయ్‌తో మరోసారి శృతిహసన్‌!

Shruti Hassan again with Vijay!

అగ్రహీరో విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రంలో హీరోయిన్‌ శృతిహాసన్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్‌ సరసన ‘పులి’ సినిమాలో శృతి హీరోయిన్‌గా నటించారు. సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో శృతి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. రజనీకాంత్‌, శృతిహాసన్‌ ఇటీవలే థాయ్‌ నుంచి చెన్నై తిరిగి వచ్చారు. అదే సమయంలో విజయ్‌ 69వ చిత్రం ‘జన నాయగన్‌’ షూటింగ్‌ నగర శివారు ప్రాంతమైన పనైయూరులో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో శృతిహాసన్‌ పాల్గొన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో బాబీ డియోల్‌, మమితా బైజు, గౌతం వాసుదేవ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌, వరలక్ష్మి, డీజే అరుణాచలం తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందే ఈ…

జ్ఞానంతో పాటు సంస్కారం అవసరం : టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ

Culture is necessary along with knowledge: TWJ state president K. Wirahat Ali

విద్య అనేది మనిషికి కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుందని, అయితే జ్ఞానంతో పాటు సంస్కారాన్ని అందిస్తేనె ఆ విద్యకు సార్థకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు. మంగళవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ఎస్.యం.ఆర్ ఫంక్షన్ హలులో జరిగిన త్రివేణి హైస్కూల్ 17వ, వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుల్లో డిగ్రీలు పొందడం ద్వారా సమాజంలో విద్యావంతులుగా మాత్రమే గుర్తింపు పొందగలుగుతారని , అదే సంస్కారంతో కూడిన విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉత్తములుగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నేడు రాకెట్ వేగంతో సాంకేతిక రంగం దూసుకెళ్తుండడంతో సమాజం ఎంతో మురిసిపోతుందని, కానీ దాని నుండి సంభవిస్తున్న దుష్పరిణామాలను మాత్రం…

‘వీడీ12’ చిత్రానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌!

NTR's voice over for 'VD12'!

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ చేసేందుకు మేకర్స్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌ విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌కు తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండగా.. తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాయిస్‌ ఓవర్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్‌ దేవకొండ…

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

83,711 candidates are eligible for TET exams

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో పేపర్‌-1లో 69,476 మంది అభ్యర్థులకుగాను 41,327 (59.48 %) మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్‌-2లో మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌లో 69,390 మంది పరీక్షకు హాజరుకాగా.. 23,755 (34.24 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సోషల్‌ స్టడీస్‌ పేపర్‌లో 66,412 మందికిగాను.. 18,629 (28.205 %) మంది అర్హత సాధించారు. మొత్తానికి పేపర్‌-1, పేపర్‌-2 రెండూ కలిపి 2,05,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో…

Pujya Gurudev Sri Sri Ravi Shankar Guruji launches the first song Shiva Shiva Shankara of the much-awaited film Kannappa

'Shiva Shiva Shankara' song released from Vishnu Manchu's 'Kannappa'

In an extraordinary turn of events, the highly awaited film Kannappa has just unveiled its first song Shiva Shiva Shankara on Monday. Making this moment even more special, Pujya Gurudev Sri Sri Ravi Shankar Guruji, the revered founder of the Art of Living Foundation, has graced the occasion by launching the song. This marks the first time Guruji has lent his presence to the music release of a film, making this a truly landmark event. The song has been launched at Sri Sri Ravi Shankar Ji’s ashram in Bangalore, with…

విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి ‘శివా శివా శంకరా’ పాట విడుదల

'Shiva Shiva Shankara' song released from Vishnu Manchu's 'Kannappa'

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప టీం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు. బెంగుళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమంలో డా.మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేష్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్,…

నవంబర్‌ నుంచి ‘దేవర 2’ షూటింగ్‌ మొదలు…

'Devara 2' shooting starts from November...

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్‌ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్‌-2’ స్క్రిప్ట్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్‌ కొరటాల శివ, తన టీమ్‌తో గత కొన్ని వారాలుగా వర్క్‌ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక అప్‌డేట్‌ రానప్పటికీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించారు. సైఫ్‌అలీ ఖాన్‌ విలన్‌ పాత్ర పోషించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌,…

నా భర్తతో పెళ్లి మాత్రమే అయింది : సాక్షి అగర్వాల్‌

I only got married to my husband: Sakshi Agarwal

నటి సాక్షి అగర్వాల్‌ జనవరి 2, 2025న తన చిరకాల స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గోవాలో జరిగింది.పెళ్లి తర్వాత కూడా సాక్షి అగర్వాల్‌ సినిమాల్లో నటిస్తున్నారు. సాక్షి అగర్వాల్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో తన వైవాహిక జీవితంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ఇంకా వైవాహిక జీవితం ప్రారంభించలేదని సాక్షి చెప్పుకొచ్చింది. పెళ్లి మాత్రమే అయిందని, సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల వైవాహిక జీవితానికి టైమ్‌ కేటాయించలేదని ఈ భామ తెలిపింది. అయితే వాలెంటైన్స్‌ డే కోసం తమిళనాడు అంతా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నామని, ఆ తర్వాత యూరప్‌లో హనీమూన్‌కి వెళ్లాలని అనుకుంటున్నామని సాక్షి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

చైతన్యను చూస్తుంటే గర్వంగా ఉంది : నాగార్జున

Seeing Chaitanya is proud : Nagarjuna

‘తండేల్‌’ మూవీ హిట్‌ కావడంపై అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. నాగ చైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. ‘తండేల్‌’ సినిమా విజయం సాధించడంపై చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సాయి పల్లవిని డామినేట్‌ చేసిన ఏకైక హీరో ఈ మేరకు ఆ పోస్టులో.. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. ‘తండేల్‌’ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్‌, కష్టానికి నిదర్శనం అని నాగ చైతన్యను మెచ్చుకున్నారు. అక్కినేని అభిమానులు అంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఫ్యాన్స్‌ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు అని చెప్పారు. అలానే సాయి పల్లవిపై కూడా ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ నువ్వు రాకింగ్‌. రైజింగ్‌ స్టార్‌ డైరెక్టర్‌ చందూ మొండేటి,…