ఆస్కార్ రేసులో భారతీయ చిత్రం ‘హోమ్‌బౌండ్’

Indian film 'Homebound' in Oscar race

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే చిత్ర నిర్మాత కరణ్ జొహార్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “హోమ్‌బౌండ్ ప్రయాణం పట్ల నేను ఎంత గర్వంగా, సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మా ఫిల్మోగ్రఫీలో ఇంతటి ముఖ్యమైన సినిమా ఉండటం ఒక గౌరవం” అంటూ ఆయన భావోద్వేగభరితమైన నోట్ రాశారు. కేన్స్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్ వరకు ఈ ప్రయాణం అద్భుతమని, తమ కలలను నిజం చేసిన దర్శకుడు నీరజ్ ఘైవాన్‌కు…

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్

‘Police Complaint’ teaser launched with grandeur

సౌతిండియా హాట్ ఫెవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు.…

‘Dhandoraa Is a Powerfully Crafted Film Blending Every Commercial Element with Depth,’ Says Actor Shivaji

‘Dhandoraa Is a Powerfully Crafted Film Blending Every Commercial Element with Depth,’ Says Actor Shivaji

Veteran actor Shivaji, known for choosing unconventional and layered roles, plays a pivotal part in the upcoming film Dhandoraa. Produced by Ravindra Banerjee Muppaneni under the Loukya Entertainments banner, the production house behind acclaimed films like Colour Photo and Bedurulanka 2012, Dhandoraa is directed by MuraliKanth and is scheduled for a grand theatrical release on December 25. Alongside Shivaji, the film features an ensemble cast including Navdeep, Nandu, Ravi Krishna, Manika Chikkala, Mounika Reddy, Bindu Madhavi, Radhya, and Aditi Bhavaraju in key roles. As part of the film’s promotional activities,…

‘దండోరా’ అన్ని రకాల కమర్షియల్ అంశాలతో జోడించి తీసిన అద్భుతమైన చిత్రం : నటుడు శివాజీ

‘Dhandoraa Is a Powerfully Crafted Film Blending Every Commercial Element with Depth,’ Says Actor Shivaji

విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’.  ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే.. ‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నారా? ముందుగా ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.…

‘అఖండ 2 తాండవం’విజయం ఆనందాన్ని ఇచ్చింది : బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను

The success of 'Akhanda 2 Tandavam' gave me joy: Blockbuster maker Boyapati Srinu

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ అఖండ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? -ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. ఈ సినిమా ప్రజలకు చేరాలని తీశాం. మన తత్వం…

‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరిలో రిలీజ్

'Vishnu Vinyasam' to release in February

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్  ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న…

రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

SP Balu's statue unveiled at Ravindra Bharathi campus

రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తన తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ అన్నారు. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి ప్రతి ఒక్కరితో స్నేహంగా మెలిగేవారని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరియు బాలు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి ఆయన కతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఆయన…

19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి : ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత రాజ్ కందుకూరి

The movie ‘Jin’, which is coming out on the 19th, should be a big success: Producer Raj Kandukuri at the trailer launch event

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్…

బాబీ సింహా-హెబ్బా పటేల్ జంటగా యువ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం

Yuva Productions' new film starring Bobby Simha and Hebba Patel

బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి కృష్ణ దాస్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సదాశివుని మ్యూజిక్. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత యువకృష్ణ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ మెహర్ నా స్నేహితుడు. సినిమా కోసం చాలా…

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

“Dhandoraa Will Leave Audiences with a Powerful, Uplifting Experience” – Director MuraliKanth

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే.. ‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది? మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను…