మూవీ రివ్యూ : వండర్ ‘ది డెవిల్స్ చైర్’

Movie Review: Wonder 'The Devil's Chair'

అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై . కె కె చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. డెబ్యూ దర్శకడు గంగ సప్తశిఖర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (21, ఫిబ్రవరి-20225) ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం భయపెట్టి థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం… కథ: విక్రమ్(అదిరే అభి) జూదానికి బానిసై తను పనిచేస్తున్న కంపెనీలోని కోటి రూపాయలు కొట్టేసి బెట్టింగ్ ఆడతాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆయన డబ్బు మొత్తం బెట్టింగ్ లో పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు… లీగల్ గా కేసులో ఇరుక్కుంటాడు.…