One of the biggest successes in the history of Telugu cinema, “Sankranthiki Vasthunnam”, is gearing up for its OTT and satellite premiere after having a sensational run in theatres. The film will have a unique dual premiere on Zee Telugu and ZEE5 on March 1st (Saturday) at 6 PM. Apart from the original language, Telugu, Sankranthiki Vasthunnam will be available in Hindi, Tamil, Kannada, and Malayalam on ZEE5. Directed by Anil Ravipudi, Sankranthiki Vasthunnam features Victory Venkatesh, Aishwarya Rajesh, and Meenakshi Chowdary in lead roles, along with Upendra Limaye, VTV…
Month: February 2025
ZEE5, ZEE తెలుగులో మార్చి 1న ప్రీమియర్‌గా రాబోతోన్న అనిల్ రావిపూడి, వెంకటేష్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని జీ5, జీ తెలుగు రెండింట్లోనూ ఏకకాలంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబోతూన్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ మూవీని ZEE తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. టీవీ ప్రీమియర్‌తో పాటుగా ZEE5 ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ ..‘ZEE5, ZEE తెలుగు రెండింటిలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మా ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల కంటెంట్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాం. మా ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్త కంటెంట్‌ను ఆదరిస్తుంటారు. ఈ చిత్రం…
‘Guard’ Movie Review : ‘గార్డ్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్!
అను ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ ‘గార్డ్’ సినిమా నేడు (ఫిబ్రవరి 28, 2025) విడుదల అయింది. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం… కథ: ఈ చిత్రానికి సంబంధించిన కథంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్ (విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్ (మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ…
రేపు ఎల్ బి స్టేడియంలో సంగీత నాటక అకాడమీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతున్నట్లుగానే ఆథ్యాత్మిక తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సుప్రసిద్ధ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డా. అలేఖ్య పుంజాల తెలిపారు. శుక్రవారం కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. మార్చి 2వ తేదీ హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని డా. అలేఖ్య పుంజాల వెల్లడించారు. ప్రతి యేటా తమిళనాడు తిరువయ్యూర్ లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా ఇకపై ప్రతియేటా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల…
Sabdham Movie Review In Telugu : ‘శబ్దం’ మూవీ రివ్యూ : ఫర్వాలేదనిపించే హారర్ రివేంజ్ డ్రామా!
దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘శబ్దం’. ఈ చిత్రం నేడు (28, ఫిబ్రవరి -2025) విడుదలయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : వరుసగా హోలీ ఏంజెల్ కళాశాలలో విద్యార్థులు చనిపోతూ ఉంటారు. ఆ చావులతో కాలేజీలో దెయ్యాలు ఉన్నాయనే రూమర్ జోరుగా వినిపిస్తుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ని పిలుస్తారు. అతడు వ్యోమా కాలేజీలో అడుగు పెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) అసలు ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే థీసిస్ చేస్తూ ఉంటుంది. కానీ, అవంతిక ప్రవర్తనలో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఈ క్రమంలో జరిగిన…
Sithara Entertainments, a powerhouse in Telugu cinema, is bringing a cinematic spectacle “RETRO” starring Suriya for Telugu audiences
The highly anticipated film “RETRO,” featuring acclaimed national award-winning actor Suriya, is poised to make a massive impact. The film captured everyone’s attention with the powerful teaser and is all set to release on May 1st. The much-awaited film is releasing in Telugu states, with Telugu theatrical rights acquired by Sithara Entertainments. Known for delivering blockbuster theatrical experiences, Sithara Entertainments has successfully distributed films like Leo (Tamil), Devara (Telugu), and Brahmayugam (Malayalam) across industries. Now, they are releasing RETRO in Telugu. A massive release in Telugu states is guaranteed, and…
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతికి సూర్య ‘రెట్రో’ తెలుగు హక్కులు
విభిన్న చిత్రాలు, పాత్రలలో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు విజేత సూర్య. ప్రస్తుతం సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఒక వైపు వరుస సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరోవైపు పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. లియో (తమిళం), దేవర (తెలుగు), భ్రమయుగం (మలయాళం) వంటి చిత్రాలను తెలుగునాట విజయవంతంగా పంపిణీ చేసింది. ఇప్పుడు తెలుగులో రెట్రో చిత్రాన్ని విడుదల చేస్తుంది. సితార పంపిణీ చేస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
‘మజాకా’కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థాంక్స్: తప్పకుండా చూడండి.. ఎంజాయ్ చేస్తారు : నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు. థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకి అందరూ చాలా ప్రేమతో…
అబ్సెషన్ మూవీ పోస్టర్ లాంచ్ చేసిన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్
న్యూ విజన్ సెల్యూలైడ్స్ బ్యానర్ పై రవి నాలమ్ నిర్మిస్తున్న తాజా చిత్రం అబ్సెషన్ టైటిల్, పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని రాకేష్ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ చేతుల మీదుగా అవిష్కరించారు. పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం మూవీ యూనిట్ తో గణేష్ మాస్టర్ మాట్లాడారు. అబ్సెషన్ టైటిల్ చాలా కొత్తగా ఉందని, హాలీవుడ్ పేరును తలపించేలా ఉందని, పేరు మాత్రమే కాకుండా పోస్టర్ కూడా అలానే ఉందని పేర్కొన్నారు. అనీష్ రాజ్ దేశ్ ముఖ్ అందించే సాంగ్స్ కచ్చితంగా బాగుంటాయని, త్వరగా పాటలు పూర్తి అయితే వినాలని ఉందని అన్నారు. డైరెక్టర్ రాకేష్ శ్రీపాద విజన్ ఎలా ఉంటుందో ఒక పోస్టర్…
రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా, దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వాని లీడ్ రోల్ గా “105 మినిట్స్” అనే సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేసిన దర్శకుడు రాజా దుస్సా, ఇప్పుడు తన తదుపరి చిత్రంగా తెలంగాణ యాస భాష నేపథ్యంలో ” అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే ” అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని ” శ్రీ రామకృష్ణ సినిమా ” బ్యానర్ లో గాలి కృష్ణ గారు నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా నాంపల్లి సోమాచారి, అలూరి రాజిరెడ్డి , రూప కిరణ్ గంజి గారు వ్యవహరిస్తున్నారు. ఈ కథ విషయానికి వస్తే 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటనను…