సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా ‘అమ్మదొంగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ‘పులి’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘The 19th century’ అన్నది ఉపశీర్షిక. ఈ రోజు పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సిజు విల్సన్, హీరోయిన్ కాయాదు లోహర్ , దర్శకుడు వినయన్, నిర్మాత సుధాకర్ బాబు, ప్రసాద్ నాయక్,…
Year: 2022
‘కొరమీను’ నుంచి మెలోడీ సాంగ్ ‘మీనాచ్చి మీనాచ్చి..’ వచ్చేసింది!
ప్రేమకు పేద, ధనిక అనే బేదం ఉండదు. మనసుకు నచ్చిన వారు కనపడితే చాలు వెంటనే ప్రేమ పుడుతుంది. మనసులో ప్రేమ పుట్టటం కాదు.. ఆ ప్రేమను నిచ్చెలికి అందంగా చెప్పటమూ ఓ కళ. మీనాక్షిని చూడగానే ఆ యువకుడికి హృదయం లయ తప్పింది. ఇంకేముంది. ‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడగా.. ఓ.. ఓ/మనసిచ్చి మనసిచ్చి నచ్చా నిన్నుగా.. ఓ ..ఓ/ కలగా వచ్చేశావు కళ్లకెదురుగా../ అలవై లాగావు నన్ను పూర్తిగా.. .. ’’అంటూ అందంగా పాట రూపంలో మీనాక్షిని తన ప్రేమను చెప్పేశాడా యువకుడు. ఇంతకీ కథానాయకుడు ఎవరు? అతని హృదయాన్ని దోచుకున్న మీనాక్షి ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే ఆనంద్ రవి హీరోగా నటిస్తోన్న ‘కొరమీను’ సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి…
రవితేజ ‘ధమాకా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ధమాకా’తో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు. స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో…
‘దేవుడు వరమందిస్తే..’ సంగీతంలో ‘రివ్వున ఎగిరే గువ్వలా..’ ఎగరాలనుంది : ఘంటాడి కృష్ణతో ఇంటర్వ్యూ…
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.., అందమైన కుందానాల బొమ్మరా.., రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా.., పండు వెన్నెల్లో ఈ వెనుగానం అంటూ వచ్చిన పాటలు ఇప్పటికి వినిపిస్తున్నాయంటే ఆ పాటలు ప్రేక్షకుల్నిఎంతగా అలరించియో ఇట్టే అర్ధమవుతోంది. ప్రేక్షకుల మనస్సులో బలంగా నాటుకుపోయిన విధానం అంతా ఇంతా కాదు. ఇవొక్కటే కాదు.. సంపంగి, 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రీ రామచంద్రులు, ప్రేమలో పావనీ కళ్యాణ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, అవతారం, వైఫ్, అందాల ఓ చిలుక వంటి సినిమాలకు మ్యూజికల్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాతో సంబంధం లేకుండా ఆడియో సూపర్‌హిట్ చేయ్యటమే కాకుండా, ఆ పాటలు అందరూ పాడకునేలా సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ.…
ఇక విరామం లేకుండా షూటింగుల్లో ప్రభాస్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన పద్దతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇదివరకైతే.. తను కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం అలవాటుగా ఉండేది. కానీ ఈ సారి తన పద్ధతి మార్చి విరామం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సెట్‌లో అడుగుపెడుతూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలను పూర్తి చేయడమే కాదు.. కొత్త చిత్రాల షూటింగ్‌లనూ వెంటనే ప్రారంభిస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి భారీ చిత్రాల రెగ్యులర్ షూటింగ్స్ చేస్తున్నారు. ‘ఆది పురుష్’ సినిమా వర్క్ కూడా కొంత పెండింగ్ లో ఉంది. ఇవన్నీ ఉండగానే…తాజాగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్‌లో సైతం అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఓ భారీ హౌస్ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభాస్…
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి పూజాహెగ్డే ఔట్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాజాగా సెట్స్ పై వచ్చిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను వదులుకున్నబ్యూటీ ఎవరో తెలుసా? పూజాహెగ్డే! అవును.. ఇది నిజంగా నిజమైన వార్తే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని వదులుకోవడమేమిటి? అని అనుకుంటున్నారు కదూ..!? అవును ఎవ్వరికైనా ఇదే డౌట్ రావడం కామనే! పరిశ్రమలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ రెండుపడవల ప్రయాణం చేస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ అంటూ అవసరానికి కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇదంతా ఆ భామల అత్యాశే అవుతోంది. అక్కడా మేమే .. ఇక్కడా మేమే అన్న రీతిలో వీరి వ్యవహారం సాగుతోంది. ఫలితంగా కాల్షీట్స్ కుదరకపోవడంతో కొన్ని మంచి సినిమాలను సైతం వదులుకోవలసి వస్తోంది. అన్ని భాషల్లో తమ గ్లామర్ ని పంచుతుంటారు ఈ బ్యూటీస్. ఈ క్రమంలో నాయికలు ఎదుర్కొనే ప్రధాన సమస్య…
17న నిఖిల్-అనుపమా పరమేశ్వరన్ ’18 పేజెస్’ ట్రైలర్ రానుంది
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా…
Ideal Multiplex Launches AMR Planet Mall : Secunderabad’s first state-of-art Mall and a 7-screen Multiplex
Hyderabad, 14 December 2022: Ideal Multiplex launched AMR Planet, a state-of-art mall and multiplex in Secunderabad. The AMR Planet Mall was inaugurated by Shri Nandamuri Balakrishna, an eminent film personality and a super star of Telugu Cinema. The AMR Planet mall is situated in Moulali and is spread over 220,000 Sq ft with over 40 retail stores. The Mall also has a food court spread over 18,000 Sq ft with 14 brands catering multiple cuisines. It also has a capacity to park 450 cars for the convenience of the customers.…
‘తారకరామ’ థియేటర్ పునః ప్రారంభం
– ‘తారకరామ’ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.. – తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది – అందరికీ అందుబాటులో టికెట్ ధర వుండటం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం – నందమూరి బాలకృష్ణ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై వున్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారి చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను…
సంక్రాంతి సంబరం ఎక్కడికి దారితీస్తుందో..!?
వెండితెరకు ఈ సంక్రాంతి సంబరం బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని సినీ జనాలు వాపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతుండడంతో ఇరువర్గాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి యూరప్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ తో పాటు శృతిహాసన్ పాల్గొంటోంది.…
