టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Year: 2022
మౌత్ టాక్ వల్ల ‘శాసనసభ’కు వసూళ్లు పెరుగుతున్నాయి : విజయోత్సవ సభలో హీరో ఇంద్రసేన
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ హీరో హీరోయిన్లుగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘శాసనసభ’. ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు నిర్మించారు. వేణు మడికంటి దర్శకుడు. రవిబస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా… కథా, మాటలు అందించిన రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ….శాసనసభ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రంలో హీరో ఇంద్రసేనకు మంచి పేరొచ్చింది. నారాయణ స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ప్రధాన ఆకర్షణ అవుతోంది. ఆయన ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడమే సగం విజయంగా భావించాం. ఇవాళ మా నమ్మకం నిజమైంది. అన్నారు. దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ…ఇంద్రసేనను యాక్షన్ హీరోగా…
రవితేజ ‘ధమాకా’ అంచనాలకు మించి వుంటుంది: ‘ధమాకా’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రవితేజ, శ్రీలీల అండ్ ధమాకా టీం జింతాక్ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..…
అమెరికాలో తొలిసారిగా నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయనున్న నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్
2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రతిష్ఠాపన మరియు ప్రారంభోత్సవం కోసం NJలోని ఎడిసన్ సిటీలో ఒక ప్రధాన భూమిని కేటాయించడానికి ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలిపారని తెలియజేసేందుకు మేము సంతోషిస్తున్నాము. లెజెండరీ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా యొక్క అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన వాళ్లలో నిస్సందేహంగా ఒకరు. అతని నాయకత్వం అతన్ని భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరిగా చేసింది. ఇటీవల ఎడిసన్ నగరం ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చొరవ చూపింది. మెజారిటీ తెలుగువారు తమ US ప్రయాణాన్ని సిటీ ఆఫ్ ఎడిసన్ నుండి ప్రారంభించారు మరియు న్యూయార్క్ నగరంలో చాలా మంది తెలుగువారి పనికి ఆతిథ్యం ఇస్తున్నారు. లెజెండరీ శ్రీ ఎన్టీఆర్‌కి అక్కడ ఉన్న…
శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకాలాజికల్ థ్రిల్లర్ ప్రారంభం !!!
కె. యస్. ఆర్ ప్రజెంట్స్ ఉదయ్ & రవి క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా , హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా , కమల్ కామరాజు, అజయ్ ఇతర పాత్రల్లో డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డి లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానయుడు స్టూడియో లో ఘనంగా జరుపుకుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు డాక్టర్ రవికిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ…ఈ…
‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ ట్రైలర్ విడుదల చేసిన బ్రహ్మానందం
అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి హెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యం లో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ ను విడుదల చేశారు. నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది.ఆన్నీ కుదిరితే పార్టీ…
సత్యం రాజేష్ హీరోగా చిత్రం
తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా మధు సూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి. రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. రియా సచ్చదేవా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిందబడుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.
అంగరంగ వైభవంగా పదోవ ‘కుటుంబ కళోత్సవం’వార్షికోత్సవం
తెలంగాణ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ పదోవ ” కుటుంబ కళోత్సవం ” వార్షికోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించడం జరిగింది. సంస్కృత కార్యక్రమాలు,డాన్సులు, కళా పోషక నృత్యాలు తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా లాంగ్వేజ్,కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొని ప్రసంగించారు…సినిమాకు కులం మతం, ప్రాంతాలు ఉండవని,ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా పరిశ్రమ పదికలాలపాటు కొనసాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, దీంతో ఆర్టిస్టులు ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్నారని వివరించారు.ప్రస్తుతం సినిమా షూటింగులు చాలావరకు తగ్గిపోయాయని, దీనివలన ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమలను ఆదుకోవాలని,అప్పుడే జూనియర్…
సూపర్ స్టార్ కృష్ణకు ‘మా ఊళ్లో ఒక పడుచుంది’ చిత్రాన్ని అంకితం చేయడం అత్యంత ముదావహం!!
– ఏ.పి.సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – ప్రపంచ సినిమా చరిత్రలో షూటింగ్ కంటే ముందు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నమొట్టమొదటి చిత్రం!! విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీరు.కె.రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సోమా విజయ్ ప్రకాష్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మా ఊళ్లో ఒక పడుచుంది”. దెయ్యమంటే భయమన్నది ఉప శీర్షిక. షూటింగ్ కంటే ముందు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈనేథ్యంలో భారత్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందజేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఈ వేడుకలో నిర్మాత సోమా విజయ్ ప్రకాష్, దర్శకులు వీరు కె.రెడ్డి, ప్రముఖ…
It is gratifying to dedicate Ma Oollo Oka Paduchundhi to Superstar Krishna Garu – A.P Cinematography Minister Chelluboyina Venugopalakrishna
Under Vijay Cine Creations banner, Veeru. K. Reddy is directing a different kind of film titled “Ma Oollo Oka Paduchundhi”, which Soma Vijay Prakash produces. “Deyyamante Bayamannadhi” is the tagline. The film earned a special place in the history of world cinema as it is done with its post-production work before the shooting process. Bharath World Records have notified this record, and the movie team was handed over the certificate by Andhra Pradesh Cinematography Minister Chelluboyina Venugopalakrishna. The event took place in Telugu Film Chamber in which producer Soma Vijay…
