పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో సీనియర్ నటుడిని కోల్పోయినట్లయింది. 1935 జులై 25న జన్మించిన సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు,…
Year: 2022
సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం !!!
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి బిసి.వెల్ఫేయిర్ మరియు సివిల్ సప్లయిస్ మినిష్టర్ గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం అయ్యింది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్ గా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ…
‘మణిశంకర్’ సినిమా మంచి విజయం సాధించాలి : ఆడియో విడుదలలో మురళీ మోహన్
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రయూనిట్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటులు మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, నటులు అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మణిశంకర్ బిగ్ ఆడియో సీడీని వీఐపీ…
జీఏ2 పిక్చర్స్ లో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫస్ట్ సింగిల్ అప్డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.…
అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా ‘సంతోషం’ ఓటిటి అవార్డ్స్ వేడుక
-అల్లు అరవింద్, శ్రీలీల చేతుల మీదుగా ;’సంతోషం’ 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక కర్టెన్ రైజర్ సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్న ఆయన… మొట్ట మొదటి సారిగా సంతోషం OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు. అలాగే సంతోషం 21 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరై … సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా 2021,22 లకు గాను ప్రేక్షకులను అలరించిన నటి నటులు, టెక్నీషియన్స్ లను సంతోషంగా అవార్డులతో సత్కరించారు. ముందుగా 2021 కి…
31న ఆనంద్ రవి ‘కొరమీను’ విడుదల
విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖ పట్నం సిటీకి ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు అనే డైలాగ్‌తో కొరమీను ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ డైలాగ్ వచ్చే సమయంలోనే మీసాల రాజుగా యాక్టర్ శత్రు ఇంట్రడక్షన్ ఇచ్చారు. విశాఖకు వచ్చిన మీసాల రాజుకి మీసాలుండవు. అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. సీతారామరాజుకి అది పెద్ద సమస్యగా మారుతుంది. మరో వైపు విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్‌కి సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్ చేస్తాడు. మరో వైపు జాలరి పేటలో ఉండే డాన్ కరుణ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్రలో హరీష్ ఉత్తమన్ కనిపించారు. అలాంటి కరుణాకి రైట్ హ్యాండ్ కోటి. పాత్రను మన కథానాయకుడు…
‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ అని ఓ వీడియో విడుదల చేశారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ‘బెదురులంక 2012’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012’ వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు. విశాలమైన గోదావరి… తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు… మధ్యలో మనుషులు… బండి మీద దూసుకు వెళుతున్న…
డిసెంబర్ 31 న అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెపుతూ వాకింగ్ స్ట్రీట్ విత్ రాహుల్ సిప్లిగంజ్ “NYE 2023” మ్యూజికల్ ఈవెంట్
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ద్వారా హైదరాబాద్ ప్రేక్షకులలో, సంగీత ప్రేమికులలో జోష్ నింపేందుకు రాహుల్ సిప్లిగంజ్ ఈ నెల 31 న, 2022 కు వీడ్కోలు చెపుతూ 2023 కి వెల్ కమ్ చెప్పేందుకు వా కింగ్ స్ట్రీట్ విత్ రాహుల్ సిప్లిగంజ్ “NYE 2023” పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ ను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి సిద్దమయ్యారు. ఈ ఈవెంట్ లో ఎంతో మంది టాప్ సింగర్స్ పాల్గొంటారు. ఈ మ్యూజిక్ ఫెస్ట్ లో మెలోడీ, మాస్ పాటలు ఇలా అన్ని రకాల పాటలను కవర్ చేస్తూ లైవ్ పెర్ఫార్మన్స్ ప్రదర్శించి సంగీత ప్రియులను ఊర్రూతలూగించ నున్నారు.ఈ సందర్బంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డిసెంబర్ 31 న జరగబోయే ఈవెంట్ కు టికెట్స్, మరియు పోస్టర్స్ ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం సింగర్ రాహుల్…
పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన!
ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు ఖుదీరామ్ బోస్. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా నడుస్తుంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.వి.ఎస్.రాజు దర్శకత్వంలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగర్లమూడి టైటిల్ పాత్రలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే…
సంక్రాంతి బరిలోకి తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ‘తెగింపు’
కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోగా అజిత్ కుమార్‌కు అసామాన్యమైన అభిమాన గణం ఉంది. అజిత్ నటించే సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ తన కొత్త సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు అంటూ రాబోతోన్నారు. తునివు అంటూ తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు అనే టైటిల్‌తో రాబోతోన్నారు. తలా అంటూ ముద్దుగా పిలుచుకునే అజిత్ కుమార్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులోనూ అజిత్ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి తెగింపు అంటూ అజిత్ రాబోతోన్నాడని తెలియడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. హెచ్ వినోద్…
