మంజిమా మోహన్ ఈ మధ్య ప్రేమలో పడిందని, ఓ యంగ్ హీరోని త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలతో కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లో కూడా ఆమె పేరు బాగా వైరల్ అయింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. సీనియర్ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్. చాలా కాలం నుండి వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా వార్తలు బయటికి వచ్చినా..ఈ విషయంలో వీరిద్దరు కానీ, వారి ఫ్యామిలీల నుంచి కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా వారి బంధంపై వారే క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్.. త్వరలో ఒక్కటి కాబోతున్నట్లుగా చెబుతూ.. వారికి నిశ్చితార్థం కూడా పూర్తయినట్లుగా తెలిపే కొన్ని ఫొటోలను షేర్ చేశారు.…
Year: 2022
జాన్వీ కపూర్ సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనుందా?
ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త బాగా షికారు చేస్తోంది. ‘ఎన్ఠీఆర్30’ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ చేయబోతోందని! అవునా.. ఇది నిజమా? అంటున్నారు జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు. అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపిస్తోందిట! ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించాలని అనుకుంటోందట. కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల గురించి, అలాగే ఎన్టీఆర్ గురించి ప్రతి చోటా మాట్లాడుతోన్న తీరు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. వాస్తవానికి ‘లైగర్’ సినిమాతో జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పూరి జగన్నాథ్ ఎంతగానో ప్రయత్నించారట. ఈ విషయం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో కూడా పూరి చెప్పుకొచ్చారు. ‘లైగర్’ కంటే ముందు కూడా చాలా సినిమాల విషయంలో జాన్వీ…
‘యశోద’లో యాక్షన్ సహజంగా ఉంటుంది : యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి…
Hollywood Stunt Choreographer amazed by Samantha’s dedication!!
Samantha’s upcoming Action Thriller ‘Yashoda’ directed by Hari – Harish is up for release on November 11th 2022. Produced by Sivalenka Krishna Prasad’s production under Sridevi Movies, movie is made on a lavish budget and the Production values are evident in the recently released trailer. Garnering immense hype on the movie, Trailer gave a glimpse of the concept of story and even the action, emotion and thrill we shall witness in theatres. Glad by the response, Action choreographer Yannick Ben reveals insights about the making of the these High-voltage Fights…
నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని విజయాలు సాధించిన ఎల్. విజయలక్ష్మిగారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి : నందమూరి బాలకృష్ణ
ఎల్.విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. 50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న, లెజెండరీ నటుడు,యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు తెనాలిలో ఆమెకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సోమవారంనాడు…
రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్ గా సోనీ మ్యూజిక్
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని రియా షిబు నిర్మాతగా హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, విక్రమ్, డాన్, వీటికే వంటి పలు బ్లాక్బస్టర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు, హిందీ చిత్రం ముంబైకర్ తో పాటూ పులి, ఇంకొక్కడు, ఏబీసీడి, సామి స్క్వేర్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు. థగ్స్ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ప్రామిసింగ్ యంగ్ హీరో హ్రిదు హరూన్ లీడ్ రోల్ లో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అమెజాన్ లో…
Raw Action Film ‘THUGS’ is associated With Top music label- Sony Music as its Music Partner In All Languages
Renowned Dance Master Brinda Gopal’s latest Directorial film kumari mavattathin “Thugs” is attempting for a multilingual release including Hindi. This real raw action is Produced by Riya Shibu under the banner HR Pictures, Who has recently distributed films like RRR, Vikram , DON, VTK etc and produced Hindi film “Mumbaikar” Riya Shibu is daughter of Shibu Thameens who is also known for Producing big canvas films like Puli, Inkokkodu, ABCD, Saamy square etc and also distributed around 100 plus films in different languages . The lead cast are Bobby Simha,…
జర్నలిస్ట్ ప్రభు రాసిన “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్టు ప్రభు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి జర్నలిస్టు ప్రభు కేక్ కట్ చేసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మెగాస్టార్ చేతులు మీదుగా “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల, వడ్డే రమేశ్, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారి జీవిత చరిత్రలను జర్నలిస్ట్ ప్రభు ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. మెగాస్టార్ చేతుల మీదుగా ఆవిష్కరించిన తొలికాపీకి వేలంపాట నిర్వహించగా.. రవి పనస రూ.4 లక్షలకు ఆ పుస్తకాన్ని…
‘కాంతార’కు ఎదురుదెబ్బ!
విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కాంతార’కు ఎదురుదెబ్బ తగిలింది. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది. దీంతో, వారి అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్, ఇతర మ్యూజిక్స్ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. దీన్ని తెలియజేస్తూ థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది.
కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. దివంగత స్టార్ పునీత్ కు ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే! నవంబర్ 1న జరిగే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమం లో పునీత్ భార్య కు ఈ పురస్కారం అందించనున్నారు. ఈ వేడుక లో సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ రావడానికి సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.
