కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఘోస్ట్ 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంది. మొదటి షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు మేకర్స్. అర్జున్ జన్య అద్భుతమైన బిజీఎమ్ తో ఉన్న మేకింగ్ వీడియో చిత్రం…
Year: 2022
విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ నుండి ‘చల్ చక్కని చిలక’ పాట విడుదల
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ‘ఆర్ టీ టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ‘మట్టి కుస్తీ’ లో విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి చల్ చక్కని చిలక పాటని విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల అందమైన పెళ్లి పాటిది. జస్టిన్ ప్రభాకరన్ ఈ పెళ్లి పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. రెహమాన్ పాటకు చక్కని సాహిత్యం…
అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం!
నట సింహ నందమూరి బాలకృష్ణ గారి గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత ప్రఖ్యాత సినీ నటి జయప్రదకు ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథి గా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు…
చక్కటి ప్లానింగ్‌తో మణిశంకర్ సినిమాను నిర్మించారు : సంజన గల్రానీ
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. విడుదల తేదీపై దర్శక నిర్మాతలు ప్రకటన చేశారు. ఈ ఈవెంట్‌లో.. సంగీత దర్శకుడు ఎం ఎల్ రాజా మాట్లాడుతూ.. ‘సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది.…
‘పఠాన్’ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్!
పఠాన్ సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం కాంబినేషనలో రాబోతోన్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా, యాక్షన్ థ్రిల్లర్‌గా, స్పై యూనివర్స్‌లో ది బెస్ట్ చిత్రంగా తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇండియన్ మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచేలాంటి అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కనెక్ట్ అయ్యేలా సీన్స్ ఉంటాయట. ఈ మేరకు దర్శకుడు సిద్దార్థ్ మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఇలాంటి ఓ విజువల్ వండర్, యాక్షన్ సీక్వెన్స్ తీస్తుంటే దానికి తగ్గ విజన్ ఉన్న టీం మనకు అవసరం పడుతుంది. సరిగ్గా అలాంటి ఓ టీం మాకు దొరికింది. టామ్ క్రూజ్ కోసం పని చేసిన కాసీ…
Shah Rukh Khan has a Tom Cruise connect in YRF’s Pathaan!
Aditya Chopra and ace director Siddharth Anand are relentlessly working to make Pathaan India’s biggest action spectacle! The visually spectacular Yash Raj Films’ action extravaganza, Pathaan, is part of Aditya Chopra’s ambitious spy universe and has the biggest superstars of the country Shah Rukh Khan, Deepika Padukone and John Abraham in it. It has now come to light that Pathaan has a huge Tom Cruise connect that is going to blow the minds of every spectacle movie going audience in India! Siddharth reveals, “When one sets out to make the…
2023 is a golden year for Kiran Abbavaram
The latest sensation Kiran Abbavaram debuted with “Raja varu Rani Garu” in 2019 which was a decent Hit. He attracted the youth with his innocent acting and nostalgic character. Later in 2021 he came up with a Commercial Family Entertainer, “S.R. Kalyana Mandapam” which was a part of getting back the glory of theatres after covid with huge numbers at the box office and introduced him as a commercial hero. This film brought him huge craze amongst the B C centres and families for the father-son emotions in the film.…
భారీ లైనెప్ ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం
లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం 2019లో “రాజా వారు రాణి గారు”తో అరంగేట్రం చేసాడు, ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో, అమాయకంతో కూడిన క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన “ఎస్.ఆర్. కల్యాణ మండపం” బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కోవిడ్ తర్వాత థియేటర్ల కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కి బిసి సెంటర్స్‌లో, ఫ్యామిలీస్‌లో విపరీతమైన క్రేజ్‌వచ్చింది. 2022లో ప్రేమకథ మరియు కమర్షియల్ సినిమా తర్వాత అతను కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ “సెబాస్టియన్ పిసి 524”ని ప్రయత్నించాడు, ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు, అయితే అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం…
‘ఇట్లు..మారేడుమిల్లి ప్రజానీకం’ అందరూ చూడాల్సిన సినిమా : చిత్ర యూనిట్
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఒక నిజాయితీ గల సినిమా. మన చుట్టూ జరిగే కథ. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మోహన్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారు.. టీం అంతా కలసి చాలా మంచి వర్క్ చేశాం. చివరి ఇరవై నిమిషాల్లో చాలా కీలకమైన యాక్షన్…
ఓటీటీలో ‘కాంతార’కు ఊహించని షాక్!
‘కాంతార’ చిత్రం తెలుగులో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే! రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిపెను తుపానునే సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయి.. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కన్నడ నుంచి వచ్చిన ఈ ‘కాంతార’ గొప్ప విజయాన్ని సాధించి వాహ్.. అనిపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. కన్నడతో పాటు.. తెలుగులో కూడా ఈ ‘కాంతార’ చిత్రం మంచి రాబడిని సాధించుకుని ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండియా సినిమాతో సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు పొందింది. కన్నడ, తెలుగుతో పాటు,…
