“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్నారు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ దర్శకుడి గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘లైఫ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ దట్ యూ క్రియేట్, యూ ఆర్ ఏ మాస్టర్ పీస్. బట్ హూ ఆర్ యూ. వెల్ కమ్ టు…
Year: 2022
‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో సంచలనం : సౌత్ ఇండియన్ ఈవెంట్లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాలను గుర్తించి ఆయా సినిమాల్లో భాగమైన వారికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తోంది సంతోషం సంస్థ. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది మిస్ కాకుండా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది,…
‘ఏ జర్నీ టు కాశీ’ ట్రైలర్ విడుదల
వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈరోజు పాత్రికేయ సమక్షంలో విడుదల చేసారు. అనంతరం హీరో చైతన్య రావు మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ చిత్రం నా కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రం. చాలా మంచి కథ. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ముని కృష్ణ గారికి నిర్మాతలు బాలాజీ గారికి శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కంటెంట్ ఉన్న…
‘రుద్రంగి’లో మల్లేశ్ పాత్రలో ఆశిష్ గాంధీ ఫస్ట్ లుక్..మోషన్ పోస్టర్ విడుదల
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి ఆశిష్ గాంధీ నటిస్తున్న మల్లేశ్ పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. డబుల్ బ్యారెల్ గన్ తో ఫెరోషియస్ గా ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి…
‘Lucky Lakshman’, releasing on December 30, is a family entertainer: Hero Sohel at Teaser launch event
‘Lucky Lakshman’ stars Bigg Boss fame Syed Sohel and Mokksha in the lead. Haritha Gogineni is producing it on Dattatreya Media Guaranteed Limited. AR Abhi is directing it. The film will be released in theatres on December 30. The film’s teaser was today released in Hyderabad at Prasad Labs. The core team of the film participated in the event. Tips Music is the label on which the audio is out. Speaking on the occasion, Malkapuram Shivakumar said that Sohel is popular. He added that everyone must encourage ‘Lucky Lakshman’. He…
డిసెంబర్ 30న వస్తున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది : టీజర్ విడుదలలో హీరో సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా శనివారం చిత్ర యూనిట్ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సోహైల్, నిర్మాత హరిత గోగినేని, దర్శకడు అభి, బిగ్ బాస్ ఫేమ్స్.. మెహబూబ్, అఖిల్ సార్థక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా… మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘మనందరికీ సోహైల్ సుపరిచితుడే. తను హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నటుడిగా తను రాణిస్తాడని భావిస్తున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి…
`విప్లవ సేనాని వీర గున్నమ్మ` విడుదలకు సిద్ధం!
కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ పై గూన అప్పారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `విప్లవ సేనాని వీర గున్నమ్మ`. ఆదిత్య భరద్వాజ్, మహీరా హీరో హీరోయిన్లుగా నటించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ…“ శ్రీకాకుళం జిల్లాలోని మందస ప్రాంతంలో జరిగిన జమీందారి వ్వతిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ పోరాటాన్ని … సంఘటన స్థలంలోనే భారీగా చిత్రీకరించాం. అప్పుడు జరిగిన పోరాటంలో ఐదుగురు రైతులతో పాటు , ఇద్దరు పోలీసులు మృతి చెందుతారు. మరో…
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా సాయితేజ్ హీరోగా చిత్రం ప్రారంభం!
సుప్రీమ్ హీరో సాయి తేజ్ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్బంగా జరిగిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు భోగవల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ అమ్మగారు విజయ దుర్గ, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సతీమణి విజయ లక్ష్మి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బుచ్చి బాబు సానా సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘‘సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు…
తరుణ్ భాస్కర్ దాస్యం పాన్ ఇండియా చిత్రం ‘కీడా కోలా’ రెండో ‘ షెడ్యూల్ ప్రారంభం
యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తయింది. ఈ రోజు నుండి రెండో షెడ్యూలుని ప్రారంభించింది చిత్ర యూనిట్. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల…
దర్శకుడు గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ-రవి ప్రఖ్యా వివాహం
కళ్యాణం కమనీయం.. హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు సిద్ధం చేసి దానిపై వధువరులను కూర్చుండబెట్టి ఒక్కటి చేసి మంగళ వాయిద్యాలతో వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఆశీర్వదించటానికి సిద్ధమయ్యారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. ఆయన ప్రథమ కుమార్తె, శాకుంతలం మూవీ ప్రొడ్యూసర్ అయిన చి.సౌ.నీలిమ గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) .. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు, హైదరాబాద్ వాస్తవ్యులు అయిన డా.రామకృష్ణ పింజల, శ్రీమతి సత్య పింజల గారి కుమారుడు రవి ప్రఖ్యాతో జరగనుంది. అంగ రంగ వైభవంగా జరగుతున్న వీరి పెళ్లికి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ వేదిక అయ్యింది. పలువురు సినీ,…
